స్వగ్రామానికి గల్ఫ్ వలసజీవి
చందుర్తి(వేములవాడ): జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లిన వలసజీవి అనారోగ్యం బారిన పడ్డాడు. స్వగ్రామం వచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతుండగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో బుధవారం ఇంటికి చేరాడు. చందుర్తి మండలం కట్టలింగంపేటకు చెందిన యువకుడు తీగల గంగరాజు జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పని దొరక్క చేతిలో డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలోనే 15 రోజుల క్రితం పక్షవాతం రావడంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక గదిలోనే ఉండిపోయాడు. ఈ విషయాన్ని కట్టలింగంపేట గ్రామస్తులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇండియా ఎంబసీ అధికారులతో మాట్లాడి టికెట్ ఇప్పించడంతోపాటు దుబాయ్‌లో ఉంటున్న చందుర్తి మండలానికి చెందిన మోతె రాములు, కటకం రవి యువకునికి టికెట్, పాసుపోర్టు అందజేసి స్వగ్రామానికి పంపించారు. స్వగ్రామానికి చేరుకోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment