అక్కాచెల్లెల్లు.. సర్కారు నౌకర్లు
జ్యోతినగర్: ఆడ పిల్లలను అధైర్య పడలేదు. కొడుకుల కన్నా ఎక్కువగా చదివించారు. ప్రయోజకులను చేశారు. ఆ తల్లిదండ్రుల కష్టాన్ని ఆ ఆడబిడ్డలు విస్మరించలేదు. కష్టపడి చదివారు. అందరూ ప్రయోజకులు అయ్యారు. సర్కారు కొలువులు కొట్టారు. ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీలో నివసిస్తున్న సింగరేణి మాజీ ఉద్యోగి మల్లేపల్లి పోచం– లక్ష్మీ దంపతులకు నలుగురు కూతుర్లు శ్రీమతి, తులసీ, శైలజ, జ్యోతి. పెద్ద కూతురు మల్లెపల్లి శ్రీమతి కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. రెండో కూతురు మల్లెపల్లి తులసీదేవి స్కూల్ అసిస్టెంట్ రామగుండంలో విధులు నిర్వహిస్తున్నారు. మూడో కూతురు మల్లేపల్లి శైలజ అంతర్గాం మండల పరిషత్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నాలుగో కూతురు మల్లుపల్లి జ్యోతి బ్యాంకు మేనేజర్‌గా కొనసాగుతున్నారు.
అక్కాచెల్లెల్లు.. సర్కారు నౌకర్లు
Comments
Please login to add a commentAdd a comment