అంబేడ్కర్‌కు అవమానం
● ఖండించిన దళిత సంఘాలు
సారంగాపూర్: సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామంలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి చెప్పుల దండ వేశారు. విషయం తెలుసుకున్న నాగునూర్, రంగపేట, లచ్చక్కపేట గ్రామాల ప్రజలు, దళిత సంఘాల నాయకులు శుక్రవారం వేకువజామున అక్కడికి చేరుకుని చెప్పుల దండ తొలగించి, విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై లోతైన విచారణ జరపాలని పోలీసులను కోరారు. డీఎస్పీ రఘుచందర్, ఇన్‌చార్జి సీఐ రవికుమార్, ఎస్‌బీ సీఐ అరీఫ్‌అలీఖాన్, సారంగాపూర్ ఎస్సై దత్తాద్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంత గ్రామంలో పర్యటించారు. నిందితులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశా రు. నాయకులు తేలు రాజు, అనంతుల గంగారెడ్డి, సాగి సత్యంరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment