జనగామ రూరల్: కుమ్మరులు ఆధునిక యంత్రాలను ఉపయోగించాలని అఖిల భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభకార్ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మిరుదొడ్డి శివనంద్ ప్రజాపతి అన్నారు. శుక్రవారం పట్టణంలోని జూబ్లీ ఫంక్షన్‌హాల్‌లో మొల్లబాంబ 585వ జయంతిని హిందూ కుమ్మర శాలివాహన ప్రజాపతి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ, అభివృద్ధి సంఘం జిల్లా కమిటీ ఽఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో విద్యను అభ్యిసిస్తూ అని రంగాల్లో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జివిలికపల్లి నరహరి ప్రజాపతి, దాసారం కృష్ణమూర్తి, కాసర్ల పరుశరాములు, ఎలిశాల యదగిరి, కొలిపాక సంపత్, దామెర యాదగిరి, నర్సంహరావు, కట్కూరి సిద్దులు విష్ణు, చల్ల నర్సయ్య, ఎల్లయ్య, తాడూరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.