బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
12,700
– 8లోu
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో చింతపండు గిట్టుబాటు ధరకు మించిపలుకుతుంది. జిల్లాలో ఈసారి చింత దిగుబడి తగ్గడంతో గతేడాదితో పోలిస్తే రకాన్ని బట్టి 70 నుంచి 100 శాతం పెరిగింది. ఒకింత రైతులు సంతోషంగా ఉన్నప్పటికీ... ఆశించిన మేర దిగుబడి లేకపోవడంతో సరాసరి మిగులు బాటుతోనే సరి పుచ్చుకుంటున్నారు. హోల్‌సెల్ మార్కెట్‌లో కిలో చింతపండు రూ.90 నుంచి రూ.127 పలుకుతుంది. రిటైల్‌గా రూ.150కి కూడా అమ్ముతున్నారు. జనగామ మార్కెట్‌కు యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, జనగామ, సిద్ధిపేట జిల్లాలకు చెందిన రైతులు నిత్యం జిల్లా కేంద్రంలోని ఏఎంసీకి చింతపండును తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.
జిల్లాలో ఒకశాతమే అటవీ ప్రాంతం..
జిల్లాలో అటవీ ప్రాంతం ఒక శాతం మాత్రమే ఉంది. బచ్చన్నపేట మండలం సాల్వాపూర్, మన్‌సాన్‌పల్లి, నర్మెట, జనగామ మండలం తదితర ప్రాంతాల్లో కొంత మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ, పెద్దగా చింత చెట్లు లేవు. రైతుల వ్యవసాయ పొలాలతో పాటు గ్రామాల్లో సొంతంగా పెంచుకున్న చెట్లు మాత్రమే ఉంటాయి. ఆ చెట్లను గుత్తేదారులకు ఒక్కో చెట్టుకు రూ.3వేల నుంచి రూ.5వేలకు కుల్లుగుత్తగా ఇచ్చేశారు. గత కొంత కాలంగా గుత్తేదారులు చింత పూతను కాపాడుకుంటూ, దిగుబడి తగ్గిపోకుండా రాత్రింబవళ్లు అక్కడే కాపలా ఉన్నారు. అయినప్పటికీ ఆశించిన మేర దిగుబడి రాలేదు. ఒక్కో చెట్టుపై కాయలు రాల్చేందుకు రూ.1000, కాయలను కొట్టి చింతపండు తయారు చేసేందుకు గంపకు రూ.150 నుంచి రూ.200 చెల్లించారు. చెట్టుకు అద్దె, కూలీల ఖర్చు తడిసి మోపెడు కావడంతో గుత్తేదారులకు మిగులుబాటు అవుతుందా? అనే సందేహంలో ఉన్నారు.
మార్కెట్‌లో 170 క్వింటాళ్లు కొనుగోళ్లు..
ఈసారి చింతపండు దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో ఒక్కసారిగా ధర పెరిగింది. గతేడాది క్వింటా చింతపండు ధర రూ.6,180, రూ.6వేలు, రూ.6,150 మూడు ధరలు పలుకగా.. ఈ సారి ఊహించని విధంగా ధర పలుకుతుంది. ప్రస్తుత సీజన్‌లో ఏ గ్రేడ్ చింతపండు క్వింటాకు రూ.12,700, బీ, సీ, రకానికి రూ.9 వేలు, రూ.8వేల మేర ధర పలికింది. ఇప్పటి వరకు మార్కెట్‌లో 170 క్వింటాళ్ల చింతపండు కొనుగోలు చేయగా, ప్రైవేట్ మార్కెట్‌లో 500 క్వింటాళ్ల వరకు అమ్మకాలు జరిగినట్లు సమాచారం.
న్యూస్‌రీల్
జనగామ ఏఎంసీలో మూడు కేటగిరీల్లో కొనుగోళ్లు
వేలం పాటతోనే కొనుగోళ్లు చేయాలని రైతుల డిమాండ్
జిల్లాలో తగ్గిన దిగుబడి
చింతపండు @
చింతపండు @