శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025
– IIలోu
● ప్రాథమిక విద్యార్థుల పఠన సామర్థ్యం పెంపుపై దృష్టి
● సాంకేతికతను అందిపుచ్చుకుని సబ్జెక్టులపై బోధన
● ఉన్నత పాఠశాలలకు ప్రాథమిక స్కూళ్ల అనుసంధానం
● జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద 17 పాఠశాలల ఎంపిక
● సి, డి–గ్రేడ్‌లో 196 మంది విద్యార్థుల గుర్తింపు
జనగామ: చదువులో వెనుకబడిన ప్రాథమి క స్థాయి విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కా రు స్కూళ్లలో సాంకేతిక విద్య(ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ/ఏఐ)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం జిల్లాలో 12 పాఠశాలలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా.. జిల్లా విద్యాశాఖ మరో ఐదు స్కూళ్లను కలిపి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా ఈకే స్టెప్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో విద్యా బోధన అమలు చేస్తోంది. కంప్యూటర్ల సహాయంతో తెలుగు, ఇంగ్లిష్, గణితంలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు దృష్టి సారించారు.
హైస్కూళ్లకు అనుబంధంగా..
జిల్లాలో కంప్యూటర్లు అందుబాటులో ఉండి.. ఉన్నత పాఠశాలలకు అనుబంధంగా ఉన్న 17 ప్రాథమిక పాఠశాలలను పైలట్ ప్రాజెక్టు కింద ఏఐ బోధనకు ఎంపిక చేశారు. అందులో బచ్చన్నపేట మండలంలోని ఇటుకాలపల్లి, దబ్బగుంటపల్లి, చిల్పూరు మండలం లింగంపల్లి, శ్రీపతిపల్లి, దేవరుప్పుల మండలం నీర్మాల, జనగా మ మండలం మరిగడి, కొడకండ్ల మండలం పాకాల, లింగాలఘణపురం మండలం కళ్లెం, నేలపోగుల, పాలకుర్తి మండలం బొమ్మెర, తొర్రూరు(జె), చెన్నూరు, తరిగొప్పుల మండలం అబ్దుల్‌నాగారం, జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్, తిడుగు, హిమ్మత్‌నగర్ పాఠశాలల్లో సి, డి–గ్రేడ్‌లో ఉన్న 3, 4, 5 తరగతులకు చెందిన 196 మంది విద్యార్థులకు ఏఐ విద్య అందిస్తున్నారు.
సాంకేతికతతో సబ్జెక్టులపై బోధన
ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రోగ్రాం అమలువుతోంది. ప్రాథమిక స్థాయిలో అక్షరాస్యత, సంఖ్యా శాస్త్రం, పిల్లల సమగ్రాభివృద్ధి, రాయండం, చదవడం, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించడమే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. వెనుకబడిన విద్యార్థులను సి, డి–గ్రేడ్‌లుగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిలో విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు ఏఐ బోధనతో కృషి చేస్తోంది. అసిస్టెట్ ల్యాంగ్వేజ్ లర్నింగ్(ఏఎల్‌ఎల్/తెలుగు, ఇంగ్లిష్ నేర్చుకోవడం), అసిస్టెట్ మ్యాథమెటిక్స్ లర్నింగ్(గణితం నేర్చుకోవడం) యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
విద్యార్థులు హెడ్‌సెట్‌ను ఉపయోగించి కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత భాషను ఎంచుకుని క్లిక్ చేస్తే పదాలు కనిపిస్తాయి. వాటిని అర్థం చేసుకుని చదవాలి. ఒకటికి రెండు సార్లు ప్రయత్నించినా చెప్పలేని సమయంలో ఓ వీడియో ఓపెన్ అవుతుంది. అందులో టీచర్ తెలుగు అక్షరాలకు సంబంధించి ఒత్తులతో సహా విద్యార్థికి వివరిస్తూ పదాలను కరెక్టుగా చదివిచేలా బోధిస్తారు. ఇలా గణితంలోనూ ఏఐ టెక్నాలజీని రూపుదిద్దారు. ఇందుకు సంబంధించి కంప్యూటర్లు, హెడ్ సెట్లు, సౌండ్ సిస్టం, నెట్ సౌకర్యం విషయంలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. బడికి రెగ్యులర్‌గా రాకుండా ఉన్న పిల్లలను ఏఐ బోధనకు వచ్చేలా వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. భవిష్యత్‌లో జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ బోధన అమలు చేయనున్నారు.
17 స్కూళ్లలో ఏఐ విద్య అమలు
జిల్లాలోని 17 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ విద్య అమలు చేస్తున్నాం. కంప్యూటర్లు అందుబాటులో ఉండి, ఉన్నత పాఠశాలలకు అనుబంధంగా కొనసాగుతున్న పీఎస్‌లో అందుబాటులోకి తెచ్చాం. 3, 4, 5 తరగతుల్లో సి, డి–గ్రేడ్ విద్యార్థులు 196 మంది ఉన్నట్లు గుర్తించి వారి విద్యాప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం.
– బొమ్మనబోయిన శ్రీనివాస్‌గౌడ్, ఏఎంఓ, జనగామ
న్యూస్‌రీల్
నేర్చుకోవడం ఇలా..
ఏఐ పాఠాలు
ఏఐ పాఠాలు
ఏఐ పాఠాలు
ఏఐ పాఠాలు