‘మిర్చి’కి తెగుళ్లు
కాళేశ్వరం: మిర్చి పంటపై తెగుళ్లు దండయాత్ర చేస్తున్నాయి. లక్షలాది రూపాయలు ఖర్చుచేసి సాగుచేసిన మిర్చి రైతులకు కొత్తరకం పురుగులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చీడపీడ బెదడ కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నా రు. కొమ్మ, వేరుకుళ్లు సోకడంతో నివారణ చర్యలు చేపట్టారు. కొమ్మ, వేరుకుళ్లు తగ్గుముఖం పట్టిందని ఆశించిన రైతులకు కొత్తరకం పురుగులతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మిర్చికి ఎక్కువగా పు చ్చు, నల్లతామర, పండాకుల తెగులు పురుగులు ఆశించి రసం పీల్చడంతో పూత ఎండిపోయి పూ తంతా రాలిపోతుంది. చెట్టు ఎదుగుదల తగ్గుతుంది. దీనికి తోడు ఆకులు ముడుత పడుతున్నాయి. దీంతో రైతులు పంట సాగుపై ఆశలు వదులుకుంటున్నారు. ఎన్ని మందులు పిచికారి చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. పలు రకాల వైరస్‌లు సోకడంతో పాటు కాయదశలో పూతకు కొమ్మ బూజు, వేరుకుళ్లుతో పంటను ఆశించడంతో రైతులు నష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టా రు. పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల కురిసిన తుపాన్ ప్రభావంతో మిర్చిపంటకు నష్టం వాటిల్లిందని రైతులు మొరపెట్టుకుంటున్నారు.
జిల్లాలో మిర్చి పంట..
జిల్లాలో ఈ ఏడాది 20వేల ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేశారు. మిర్చి వాణిజ్య పంట కావడంతో ఇతర పంటలతో పోలిస్తే మూడు రెట్ల పెట్టుబడి ఎక్కువే. మిర్చి ఎకరానికి రూ.60వేల నుంచి రూ.80వేల వరకు పెట్టుబడి అవుతుంది. ప్రారంభం నుంచి వరుస తెగుళ్లు సోకడంతో పెట్టుబడి పెరిగి రెట్టింపు అయిందని రైతులు వాపోతున్నారు. అత్యధికంగా భూపాలపల్లి, రేగొండ, టేకుమట్ల, చిట్యాల, మల్హర్, కాటారం, మహదేవపూర్, కాళేశ్వరం, మహాముత్తారం, పలిమెల మండలాల్లో మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ఇలా వైరస్‌లు దండయాత్ర చేసి రైతుల నడ్డి విరుస్తున్నాయి.
పంటను ఆశిస్తున్న పుచ్చు, నల్లతామర తెగుళ్లు
పూత, కాయలు రాలి
నాశనం అవుతున్న పంట
ఆందోళనలో అన్నదాతలు
నష్టాల ఊబిలో చిక్కుకుంటున్న రైతులు
కొత్త రకం పురుగులతో...
పూతలో కొత్త రకం పురుగులు చేరడంతో పూత ఎండిపోయి రాలిపోతుంది. పూత రాలిపోవడంతో పాటు ఆకు పసుపు రంగులో మారి ముడతపడుతుందని రైతులు తెలిపారు. కొత్త రకం పురుగుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంటను వదులుకోవడమేనని రైతులు పేర్కొంటున్నారు. వరుసగా పంటలకు చీడపీడలు సోకుతున్నా ఉద్యానవన శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా రైతులకు ఇప్పటి వరకు సలహాలు సూచనలు ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పూత, కాయ రాలిపోతోంది..
నాకున్న ఎకరంన్నరలో మిర్చి పంట వేశా. ఇప్పటివరకు రూ.1.80లక్షల పెట్టుబడి ఖర్చులు అయ్యాయి. పంట మొదటి నుంచి వైరస్‌ల బెడద త ప్పడం లేదు. వేరుకుళ్లు, పుచ్చు పురు గు మిర్చి పంటకు సోకింది. వైరస్‌ల విషయంలో అధికారులు అవగాహన కల్పించడం లేదు. ఎన్ని మందులు కొట్టినా వైరస్‌ల ప్రభావం తగ్గడం లేదు. మొన్నటి వరకు వేరుకుళ్లు, కొమ్మకుళ్లు మందులు పిచికారి చేసి అలిసి పోయాం. పూత, కాయ రాలిపోతుంది.
– ఊటూరు లక్ష్మినారాయణ, అంకుషాపూర్, టేకుమట్ల
పంట మార్పిడి చేస్తే..
జిల్లా వ్యాప్తంగా కొమ్మకుళ్లు, నల్లతామర తెగుళ్లను గుర్తించాం. ఫ్లాంటామైసిన్, వేప నూనె పిచికారి చేయాలి. రైతులు ఆందోళన చెందొద్దు. బ్లూస్టిక్స్ అట్టలను మిర్చిపంటపై ఎత్తులో పెట్టాలి. తామర ఆశించకుండా ఉంటుంది. ఒక్క చెట్టుపై ఐదు–ఆరు నల్లతామర పురుగులు కనిపిస్తే పంటకు తెగులు వచ్చినట్లు. పంటను మార్పిడి చేస్తే తెగుళ్లు ఆశిందు. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– సంజీవరావు,
జిల్లా ఉద్యానవనశాఖ అధికారి
మందు కొట్టినా ఫలితం లేదు..
నాకున్న నాలుగు ఎకరాల్లో మి ర్చి సాగు చేశా. ఇప్పటి వరకు రూ.3లక్షలకు పైగా పెట్టుబడి పెట్టిన. పుచ్చు, ఇతర పురుగు పంటను ఆశించింది. పంటకు ఎన్ని రకాల మందు కొట్టినా ఫ లితం లేదు. పూతకు మరకవచ్చి రాలిపోతుంది, ఆకులు పసుపు రంగుతో ముడత వచ్చి రాలి పంట చే తికందడం లేదు. రైతుల నష్టాలను ఎవరూ పూడ్చలే రు. ప్రభుత్వం అవగాహన కల్పించాలి. దీనికి తోడు తుపాన్ ఎఫెక్ట్‌తో పూత, పిందలు రాలుతున్నాయి.
– మహ్మద్ రజాక్, కాళేశ్వరం
Comments
Please login to add a commentAdd a comment