త్వరలో ‘సూపర్ స్పెషాలిటీ’ ప్రారంభం
సాక్షిప్రతినిధి, వరంగల్ :
వరంగల్ జిల్లా అభివృద్ధిపై పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రామచంద్రునాయక్, గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్ నాగరాజు, మామిడాల యశస్వినిరెడ్డితోపాటు పీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వరంగల్ నగరంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను వేగవంతంగా పూర్తి చేసి వీలైనంత త్వరలో ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రాంపూర్–మడికొండ మధ్య ఉన్న డంపింగ్ యార్డ్ పొగ ద్వారా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే డంపింగ్ యార్డ్‌ను అక్కడినుంచి తరలించాలని కోరారు. గ్రేటర్ వరంగల్ నగరానికి మంజూరైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనుల డీపీఆర్ తయారు చేసి త్వరితగతిన పనులు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలివ్వాలని ఎమ్మెల్యేలు.. సీఎంను కోరారు. వీటిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ సంబంధిత అధికారులకు ఫోన్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 31న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం స్టేషన్ ఘనపూర్‌ను మున్సిపాలిటీగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కడియం శ్రీహరి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.
ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు సీఎం నిర్ణయం
మరింత వేగంగా ఆస్పత్రి నిర్మాణ పనులు
వివిధ పనులపై 31న ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డి సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment