‘ఏకీకృత పెన్షన్ విధానాన్ని అడ్డుకుంటాం’
ములుగు రూరల్/ఎస్ఎస్ తాడ్వాయి: ఏకీకృత పెన్షన్ విధానాన్ని(యూపీఎస్) అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు అన్నవరం రవికాంత్, ప్రధాన కార్యదర్శి మంకిడి రవి అన్నారు. ఈ మేరకు మంగళవారం యూపీఎస్ ప్రతులను మండల పరిధిలోని రాయినిగూడెం ఆశ్రమ పాఠశాలలో ఉద్యోగులు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు పోరాటాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ విధానాన్ని తీసుకు రావడం అప్రజాస్వామికమన్నారు. ఈ విధానాన్ని మానుకుని తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రావన్కుమార్, కసన్సింగ్, దేవిసింగ్, సంఘం నాయకులు సుధాకర్, నరేష్, శ్రీధర్, సమ్మయ్య, కుమారస్వామి, అరుణ, సౌమ్య, జయ, ఇందిర ప్రియ, దర్శిని, సూరయ్య, నరహరి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఎస్ఎస్ తాడ్వాయి మండల కేంద్రంలోని ఇందిరానగర్ జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు యూపీఎస్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎస్, యూపీఎస్ పత్రులను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్, యూపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రారెడ్డి, లక్ష్మయ్య, రేణుక, రజిత, వనతి, రాజబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment