క్షణక్షణం ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

క్షణక్షణం ఉత్కంఠ

Published Mon, Feb 24 2025 1:49 AM | Last Updated on Mon, Feb 24 2025 1:47 AM

క్షణక

క్షణక్షణం ఉత్కంఠ

రెండు రోజులుగా టన్నెల్‌లోనే ఎనిమిది మంది కార్మికులు

వివరాలు 8లో u

క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోంది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 14వ కిలోమీటర్‌ వద్ద చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 13 కిలోమీటర్ల తర్వాత సొరంగంలో బురద మట్టి, నీటితో పేరుకుపోవడంతో ముందుకు వెళ్లేందుకు సాధ్యపడటంలేదు. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, సింగరేణిలోని నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. సహాయక చర్యలు రాత్రంతా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు మూడు విడతలుగా సహాయక బృందాలు టన్నెల్‌లోకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నాలుగో బృందం లోపలికి వెళ్లగా.. అర్ధరాత్రి తర్వాత ఐదో బృందం టన్నెల్‌ లోపలికి వెళ్లింది.

టన్నెల్‌లోకి వెళ్లేందుకు

జంకుతున్న కార్మికులు..

న్నెల్‌లో ప్రమాద స్థలానికి చేరుకుని రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా, వారితో పాటు లోపలికి వెళ్లి మట్టి, శిథిలాలను తొలగించేందుకు కార్మికులు జంకుతున్నారు. కళ్ల ముందే ప్రమాదం చోటుచేసుకోవడంతో వారు భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ క్రమంలో లోపల శిథిలాల తొలగింపు, మట్టి తొలగింపునకు కార్మికులు వెనకాడుతుండటంతో సహాయక చర్యల్లో మందగమనం నెలకొంది. దీంతో లోపలికి వెళ్లి విధులు నిర్వర్తించే కార్మికులకు దినసరి వేతనం రూ.2 వేల చొప్పున ఇవ్వాలని ఓ ఉన్నతాధికారి సంబంధిత కంపెనీ ప్రతినిధికి సూచించారు.

శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) ఇన్‌లెట్‌ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల రెస్క్యూ ఆపరేషన్‌పై రెండు రోజులుగా ఉత్కంఠ నెలకొంది. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను చేరుకోలేకపోవడంతో ఇంకా ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. వారిని సమీపించేందుకే సహాయక బృందాలకు సాధ్యపడటంలేదు. 9.8 మీటర్ల వ్యాసార్థం ఉన్న సొరంగం నిండా మట్టి, బురద నిండిపోవడంతో కార్మికుల వద్దకు చేరడం కష్టంగా మారింది. టన్నుల కొద్దీ పేరుకున్న మట్టిని తొలగించడం సైతం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో కార్మికుల జాడ గుర్తింపుపై సందిగ్ధం నెలకొంది.

సహాయక చర్యలకు ఆటంకాలే..

సొరంగంలో కార్మికులను కాపాడేందుకు రంగంలోకి ఆర్మీ (24), ఎఫ్‌డీఆర్‌ఎఫ్‌(120), ఎస్‌డీఆర్‌ఎఫ్‌(24), సింగరేణి(24), హైడ్రా(24) రెస్క్యూ సిబ్బందితో కూడిన బృందాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఆయా శాఖల సమన్వయంతో విడతల వారీగా రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. సుమారు 6–8 గంటలకు ఒక బృందం చొప్పున షిఫ్ట్‌ల వారీగా సహాయక చర్యలను నిరంతరం కొనసాగిస్తున్నాయి. ప్రమాదం జరిగిన 13వ కి.మీ. వద్దకు లోకో ట్రైన్‌ వెళ్లడానికి గంట, రావడానికి గంట సమయం పడుతోంది. అక్కడ పెద్ద ఎత్తున మట్టి, రాళ్లతో కూడిన శిథిలాలు పేరుకుని ఉండటంతో రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే వారిని రక్షించడం కష్టంగా మారుతోంది. సంఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కడు వంశీకృష్ణ, కలెక్టర్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ రఘునాథ్‌ పర్యవేక్షిస్తున్నారు.

పంథా మార్చితేనే సాధ్యం..

కార్మికులను కాపాడేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలు ఫలించలేదు. కొత్త పంథా(టెక్నిక్‌)లో వెళ్లితే తప్ప వారిని బయటికి తీసుకురావడం సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదు. సొరంగంలో ఒకే మార్గం గుండా రాకపోకలు చేయాల్సి రావడం, ఎలాంటి ఆడిట్‌, ఎస్కేప్‌ టన్నెళ్లు లేకపోవడంతో రెస్క్యూ వీలు కావడం లేదు. రాకపోకలకు, మట్టిని తరలించేందుకు ఒకే ఒక కన్వేయర్‌ బెల్టు ఉండగా, ఆ మట్టి తరలించేందుకు దాదాపు మూడు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. సొరంగంలో నుంచి మట్టిని, రాళ్లను తొలగించడం అంతా సాధ్యమైన పని కాదని అంటున్నారు. దీంతో కొత్త పంథాలో సహాయక చర్యలు చేపడితేనే ప్రయోజనం ఉండనుంది.

ఉత్తరాఖండ్‌ తరహాలో రెస్క్యూకు సన్నద్ధం..

టన్నెల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. గతంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో టన్నెల్‌లో చిక్కుకున్న వారిని రక్షించిన తరహాలోనే ఇక్కడ కూడా ఆపరేషన్‌ నిర్వహించేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ ద్వారా పై నుంచి రంధ్రం చేసి కార్మికులను బయటకు తీసు కొచ్చేలా ప్రయత్నించే అవకాశం ఉంది. ఇందుకు గల సాధ్యాసాధ్యాలను సైతం పరిశీలించనున్నారు. సోమవారం ఉదయానికి ఈ తరహా రెస్క్యూ బృందాలు ప్రమాదస్థలికి చేరుకునే అవకాశం ఉంది.

– సాక్షి, నాగర్‌కర్నూల్‌ /అచ్చంపేట

జిల్లాలో ఐదేళ్లుగా

రొయ్యల సీడ్‌ సాగు ఇలా...

భద్రతా ప్రమాణాలపై అనుమానాలు..

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తొలుస్తున్న టీబీఎం కొన్ని రోజులుగా మరమ్మతుకు గురై పెద్ద శబ్ధంతో పనిచేస్తోందని కొందరు కార్మికులు చెబుతున్నారు. అలాగే అసంపూర్తిగా కాంక్రీట్‌ సెగ్మెంట్‌ ఉండటం, భద్రతా ప్రమాణాలు పాటించకనే ప్రమాదం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిపై అధికారులు స్పందించడం లేదు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నెల 18న పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ముందస్తుగా పనుల వద్ద సేఫ్టీ ప్రమాణాలు పాటించలేదని తెలుస్తోంది. పని మొదలుపెట్టిన నాలుగు రోజులకే ప్రమాదం చోటుచేసుకోవడంతో భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాత్రంతా కొనసాగుతున్న

సహాయక చర్యలు

అర్ధరాత్రి తర్వాత టన్నెల్‌లోకి

ప్రవేశించిన ఐదో బృందం

రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌,

ఎస్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, ఫైర్‌,

సింగరేణి, హైడ్రా బృందాలు

టన్నెల్‌ వద్ద సహాయక చర్యలను

పర్యవేక్షించిన మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
క్షణక్షణం ఉత్కంఠ 1
1/5

క్షణక్షణం ఉత్కంఠ

క్షణక్షణం ఉత్కంఠ 2
2/5

క్షణక్షణం ఉత్కంఠ

క్షణక్షణం ఉత్కంఠ 3
3/5

క్షణక్షణం ఉత్కంఠ

క్షణక్షణం ఉత్కంఠ 4
4/5

క్షణక్షణం ఉత్కంఠ

క్షణక్షణం ఉత్కంఠ 5
5/5

క్షణక్షణం ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement