ఉత్సాహంగా వృషభాల బల ప్రదర్శన
అయిజ: మండల కేంద్రంలో తిక్క వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా నిర్వహిస్తున్న రైతు సంబరాలు అంబరాన్నంటాయి. ఆదివారం నిర్వాహకులు అంతరాష్ట్ర స్థాయి సేద్యపు ఎద్దుల బల ప్రదర్శన పోటీలను నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఎద్దులను తీసుకువచ్చారు. పోటీలు కొనసాగుతున్న క్రమంలో ప్రజల ఈలలు, కేకలతో క్రీడా మైదానం హోరెత్తింది. కర్నూలు జిల్లా వేముల గ్రామం ఊరవాకిటి నడిపి గిడ్డయ్యనాయుడు, గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం శనిగపకి చెందిన చక్రవర్తిగౌడ్ ఎద్దులు (కంబైండ్) ప్రథమ స్థానంలో నిలిచి రూ.40వేలు కై వసం చేసుకున్నాయి. అలాగే, కర్నూలు జిల్లా వేములచెందిన చిన్న గిడ్డయ్య నాయుడు ఎద్దులు ద్వితీయ స్థానంలో నిలిచి రూ. 35వేలు, నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్‌కి చెందిన శ్రవణ్‌కుమార్ ఎద్దులు తృతీయస్థానంలో నిలిచి రూ.30వేలు, రాజోళి మండలం పచ్చర్లకి చెందిన సంపత్ కుమార్ ఎద్దులు నాల్గో స్థానంలో నిలిచి రూ.15వేలు గెలుచుకున్నాయి.
రైతు సంబరాల్లో భాగంగా
అంతర్రాష్ట్ర స్థాయి పోటీలు
Comments
Please login to add a commentAdd a comment