గద్వాలటౌన్/ఎర్రవల్లి/ఇటిక్యాల:: జిల్లాలో గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం జిల్లాలో ఏర్పాటు చేసిన 12 ప్రవేశ పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 4,743 మంది విద్యార్థులకు గాను 4,660 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 83 మంది గైర్హాజరయ్యారు. 98.25 శాతం హాజరు నమోదైంది.
అడిషనల్ కలెక్టర్ తనిఖీ
ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పరీక్షలు సజావుగా జరపాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. ఆదివారం ఎర్రవల్లి, ఇటిక్యాల మండల కేంద్రాల్లోని ప్రవేశ ప్రరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును సమీక్షిస్తూ.. కేంద్రంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో నిబందనలను ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. బీచుపల్లి గురుకుల పాఠశాల మరియు కళాశాలలో 188 మంది విద్యార్థులకు గాను 185మంది హాజరయ్యారు. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల మరియు కళాశాలలో 391 మందికి 378 మంది హాజరయ్యారు. ఇటిక్యాలలో మొత్తం 829 మంది విద్యార్ధులకు గాను 812 మంది హాజరు కాగా.. 17 మంది విద్యార్దులు మాత్రమే పరీక్షకు గైర్హాజరయ్యారు.
ఇటిక్యాలలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ నర్సింగరావు
Comments
Please login to add a commentAdd a comment