దివ్యాంగులకు యూనిక్ డిజెబిలిటీ ఐడీలు
గద్వాల: దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి దివ్యాంగుడికి సదరం సర్టిఫికెట్ స్థానంలో యూనిక్ డిజెబిలిటీ ఐడీ కార్డులను కేటాయించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి, విద్య, పెన్షన్ల కోసం దేశవ్యాప్తంగా ప్రయోజనం పొందే విధంగా సదరం సర్టిఫికెట్‌కు బదులు యూనిక్ డిసెబిలిటీ ఐడీ కార్డును ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జారీ చేయాలన్నారు. ఈ కార్డు దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుందన్నారు. మార్చి 2025 నుంచి 21 రకాల అంగవైకల్యాలకు సంబంధించి యూడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంతకు పూర్వం సదరం క్యాంపుల ద్వారా 7 రకాల అంగవైకల్యాలకు మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేయబడేవన్నారు. ఇక నుంచి సదరం బదులు యూడీఐడీ పోర్టల్‌లో లబ్ధిదారులు స్వయంగా గాని లేదా మీ–సేవా కేంద్రాల ద్వారా కాని పూర్తి వివరాలు నమోదు చేయాలిస ఉంటుందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు యూడీఐడీ కార్డులు స్పీడ్‌పోస్టు ద్వారా నేరుగా సంబంధిత లబ్ధిదారుల చిరునామాకు చేరుతాయన్నారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment