యథేచ్ఛగా మట్టి దందా | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా మట్టి దందా

Published Mon, Mar 10 2025 10:44 AM | Last Updated on Mon, Mar 10 2025 10:39 AM

యథేచ్

యథేచ్ఛగా మట్టి దందా

అనుమతులు లేకుండా తవ్వకాలు

సిండికేటుగా మారి..

జిల్లాలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న వ్యాపారులు గతంలో ఒకరిపై మరొకరు అధికారులకు ఫిర్యాదు చేయించి కేసులు నమోదు చేయించే వారు. లేదా మట్టి తరలిస్తుండగా వాహనాలను పట్టుకొని కొన్ని రోజులపాటు స్టేషన్‌లో ఉంచేలా పావులు కదిపేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి మొత్తం మారింది. మట్టి అక్రమ వ్యాపారులు అందరూ ఒక్కటయ్యారు. ఓ నాయకుడు రంగ ప్రవేశం చేసి మట్టి వ్యాపారులతో రెండు రోజుల క్రితం చర్చలు జరిపి అందరిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చాడు. అనుమతులు ఉన్నా లేకున్నా అన్నీ తాను చూసుకుంటానని, తాను ప్రకటించిన ధరకే మట్టిని విక్రయాలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాడు. అయితే అలంపూర్‌ సెగ్మెంట్‌లో ఓ నాయకుడు చెప్పిన వారే మట్టి తరలింపు చేయాల్సిందిగా హుకూం జారీ చేశాడు. రెవెన్యూ, మైనింగ్‌, పోలీసుశాఖ అధికారులు చర్యలు తీసుకుందామని ముందుకెళ్తే.. వారిపై బదిలీ వేటో లేదా కానుకలతో బుజ్జగిస్తున్నారు. ఈ ఘటనలపై జిల్లా మైనింగ్‌ శాఖ అధికారి మల్లికార్జున్‌ను ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.

కనుమరుగవుతున్న గుట్టలు.. కుంటలు

సిండికేటుగా మారిన అక్రమార్కులు

ప్రభుత్వ ఆదాయానికి గండి

పట్టించుకోని అధికార యంత్రాంగం

గద్వాల క్రైం: అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. కాపాడాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. సహజ వనరులైన గుట్టలను తవ్వేసి రూ.కోట్లు గడిస్తున్నారు. జిల్లాలో గద్వాల, గట్టు, కేటీదొడ్డి, మల్దకల్‌, ధరూర్‌, ఇటిక్యాల, అయిజ, మానవపాడు, అలంపూర్‌, ఉండవెల్లి మండలాల్లో గత కొన్ని రోజులుగా కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు షురూ చేశారు. ఇలా చేపడితే చట్ట పరమైన చర్యలు తప్పవని అధికారులు పేర్కొంటున్నా.. అవి మాటలకే పరిమితమయ్యాయి. ఈ మట్టి దందా నిర్వహిస్తున్న వ్యాపారులకు కొందరు నాయకుల అండదండలు ఉండడంతోనే యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో వెంచర్లు, గృహ నిర్మాణాల పనులు జోరందుకున్నాయి. దీంతో మట్టి తవ్వకాలు సైతం అదే స్థాయిలో ఉదయం, రాత్రి యంత్రాల సహాయంతో మట్టిని అక్రమంగా తరలించి పెద్ద ఎత్తున డబ్బులు వెనకేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జిల్లాలో అక్రమార్కులను కట్టడి చేయాల్సిన అధికారులు మాత్రం దాగుడుమూతలు అడుతున్నారు. అయితే ఇప్పటి వరకు మైనింగ్‌, రెవెన్యూశాఖ అధికారులు సీజ్‌ చేసిన, నిలువరించిన దాఖలాలు ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అక్రమార్కులు అందరూ సిండికేట్‌గా మారి దందా కొనసాగిస్తున్నారు.

కేసులు నమోదు చేస్తాం

అనుమతి లేకుండా జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు చేపట్టరాదు. ఇటీవల జిల్లాలో పలు చోట్ల గుట్టుగా మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. పోలీసుల తనిఖీల్లో మట్టి తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తాం. రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ శాఖల సంయుక్తగా నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. మట్టి దందా నిర్వహిస్తున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.

– శ్రీనివాసరావు, ఎస్పీ

మల్దకల్‌ మండలం ఎల్కూర్‌లో మట్టి టిప్పర్లను

అడ్డుకున్న గ్రామస్తులు (ఫైల్‌)

గద్వాల, అలంపూర్‌ సెగ్మెంట్‌లోని పలువురు ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమార్కులు మట్టి తరలింపు చేపట్టారు. మట్టి తరలింపుపై రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ శాఖల అధికారులు తమకేందుకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న వ్యాపారులు గత 20 రోజుల నుంచి మట్టి తవ్వకాల్లో వేగం పెంచారు. టిప్పర్‌ మట్టికి రూ.6వేలు, ట్రాక్టర్‌కు రూ.1600 వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఎటు చూసిన నూతన నిర్మాణాలు వేగవంతం అవుతుండడంతో మట్టి వ్యాపారులు సిండికేట్‌గా మారి ఆయా శాఖల అధికారులకు చేయి తడపడంతో సిబ్బంది చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అ క్రమార్కులకు కొందరు నాయకుల మద్దతు సై తం ఉండడంతో మట్టి మాఫియాకు ఎక్కడా లేని బలం చేకూరుతుంది. ఎవరెవరికి ఎంతో కొంత

● ఈ నెల 4వ తేదీన అర్ధారాత్రి గద్వాల మండలం నుంచి గద్వాల వైపునకు లారీల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో రూరల్‌ పోలీసులు రెండు టిప్పర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉదయం పట్టుకున్న టిప్పర్లను అనంతరం వదిలేశారు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.

● ఈ నెల 7వ తేదీన అయిజ మున్సిపాలిటీ పరిధిలో టిప్పర్ల ద్వారా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించలేదు. సామాజిక మాద్యమాల్లో మట్టి తరలిస్తున్న వీడియోలను వైరల్‌ చేయడంతో అయిజ పోలీసులు టిప్పర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గట్టు మండలంలో ఓ నాయకుడు పెద్ద ఎత్తున మట్టి నిల్వ ఉంచుకున్నట్లు తెలుస్తుంది.

● 2025 ఫిబ్రవరి 10వ తేదీన కేటీదొడ్డి మండలంలోని గ్రామ శివారులోని చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తుండగా.. విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు.

● 2025 ఫిబ్రవరి 13వ తేదీన మల్దకల్‌ మండలం ఏల్కూర్‌ గ్రామం నుంచి ప్రభుత్వ భూముల నుంచి టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకుని వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న మల్దకల్‌ పోలీసులు ఫోన్‌లో గ్రామస్తులతో మాట్లాడుతూ టిప్పర్లను వదిలేయాల్సిందిగా చెప్పారు. దీంతో గ్రామస్తులు ఫోన్‌లోనే పోలీసులకు చురకలు అంటించారు. దీంతో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వెనక్కితగ్గారు.

ఇస్తేనే మన వైపు ఎవరు రారు అనే దీమాతో ఈ దందాలోని వ్యక్తులకు రాచబాటలు కల్పిస్తారు. అయితే జిల్లాలో వీరే కీలకంగా ఉన్నారు. పోలీసుశాఖ నిఘా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో కట్టడి చేయలేక పోతున్నారు.

చర్యలు శూన్యం

జిల్లాలో చోటుచేసుకున్న

సంఘటనలు

No comments yet. Be the first to comment!
Add a comment
యథేచ్ఛగా మట్టి దందా 1
1/2

యథేచ్ఛగా మట్టి దందా

యథేచ్ఛగా మట్టి దందా 2
2/2

యథేచ్ఛగా మట్టి దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement