రసాయన పరిశ్రమలు, ట్యాబ్‌లెట్లు, ఇతర పరిశ్రమల్లో కెమికల్స్ తయారు చేసేందుకు రీ ఏజెంట్లు ఎంతో కీలకంగా మారనున్నాయి. ఇందులో రీ ఏజెంట్లు మొదట తయారు చేసేందుకు పెద్ద పరిశ్రమలను స్థాపించడం, పెట్టుబడి, ఇతర పర్యావరణానికి నష్టం చేసే విధంగా ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. కానీ, పీయూ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు చేసిన ప్రయోగాలు పూర్తిగా పర్యావరణ హితం కానున్నాయి. సాధారణ గది ఊష్టోగ్రతల వద్ద చిన్న గదుల్లో సైతం రీ ఏజెంట్లను శాసీ్త్రయ పద్ధతిలో తయారు చేసే విధానాన్ని కొనుగొనడంతో మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం పేటెంట్ రైట్ ప్రకటించింది. ఇందులో అధ్యాపకులు చంద్రకిరణ్, సిద్ధరామగౌడ్, రీసెర్చి స్కాలర్ స్వాతి భాగస్వాములయ్యారు. వీటితోపా టు మరో 20 రీఏజెంట్‌లో పరిశోధనలో ఉన్నాయి.