
జనసేన నాయకుల ఇళ్లకే సీసీ రోడ్లు
కొత్తపల్లి: గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడవల్సిన సీసీ రోడ్లను జనసేన పార్టీ నాయకులు తమ ఇళ్ల వద్దకు, పొలాలకు వేయించుకుంటున్నారు. మండలంలోని కొండెవరం గ్రామంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకు సంబంధించిన నిధులతో సీసీ రోడ్లు నిర్మాణ పనులను చేపట్టారు. పాటిమీద ఒక జనసేన పార్టీ నాయకుడికి సంబంధించిన ఇంటిలోకి రూ. 2.80 వేల నిధులతో సీసీ రోడ్డు వేయించుకున్నాడు. శొంఠివారిపాకల్లో ఇళ్లులేని ప్రదేశంలో పొలాలకు రూ.5.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డును వేశారు. కాశివారిపాకల్లో రోడ్డు బాగున్నా జనసేన పార్టీ నాయకుడు వీధికావడంతో రూ. 3.90 వేలతో రోడ్డుపై రోడ్డు వేశారు. ప్రజలకు ఉపయోగపడే రోడ్లను వేయకుండా జనసేన పార్టీ సంబంధించి నాయకుల ఇళ్లల్లోకి రోడ్లు వేయడం ఏమిటంటూ జనం విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

జనసేన నాయకుల ఇళ్లకే సీసీ రోడ్లు
Comments
Please login to add a commentAdd a comment