విజయం కోసం కృషి చేయాలి
ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రాష్ట్ర పర్యాట క, సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిధులిచ్చిన కేంద్రం.. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించి నయా పైసా ఇవ్వలేదని ఆరో పించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయలేదన్నారు. పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయని గుర్తించాలని, ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేసి ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. బీజేపీకి కులం, మతం తప్ప అభివృద్ధి తెలియదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. జిల్లాలో పట్టభద్రు లు కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరా రు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కానున్నాయన్నారు. సమావేశాలలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతారావు, మదన్‌మోహన్‌రావు, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు ఇందుప్రియ, సందీప్, జంగం గంగాధర్, శ్యామల, కునీపూర్ రాజిరెడ్డి, గంగారాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment