తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభు త్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఉన్నత చదువులు పూర్తి చేసిన విద్యార్థుల చేతికి సర్ట్టి ఫికెట్లు వస్తున్నాయి.. కానీ ఉద్యోగాలు రావడం లేదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం పేర్కొన్నారు. విద్యార్థులు చిన్న సమస్యలకే పిరికితనంతో చనిపోతున్నారని ఆ వేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ యూ నివర్సిటీలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన కీలకవక్తగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న తన సేవలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత సీఎం రేవంత్‌రెడ్డి తనకు చెప్పకుండానే ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా అవకాశం కల్పి ంచారని తెలిపారు. తెలంగాణ విద్యారంగాన్ని ఉన్న త స్థాయికి చేర్చాలని, నైపుణ్యం కలిగిన యువతను తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం ముందుకు సాగుతున్నారని అన్నారు. విద్యను అర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రణాళిక ప్రకారం సిలబస్ మార్పునకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందు లో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి కోర్సుకు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కోర్సు లో చేరే విద్యార్థులు చదువుతో పాటు ఇంటర్న్‌షిప్ లో పాల్గొనడం వల్ల ఉపాధి, ఉద్యోగావకాశాలు సాధించగలుగుతారని తెలిపా రు. అలాగే సివిల్ సర్వీస్ లో తెలంగాణ యువతకు తక్కువ అవకాశాలు వస్తున్నాయని, ఉత్తరాధి రాష్ట్రాల వారే సివిల్ సర్వెంట్లుగా మనపై పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉండటం ఒక కారణమని గుర్తించి, దీనిపై కేంద్రంతో పోరాడి ప్రాంతీయ భాషల్లో సైతం ఇంటర్వూలు చేపట్టేలా చేశామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ హానర్స్ సబ్జెక్టు ను తెలుగులో ప్రవేశపెట్టామని, ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు సివిల్ పరీక్షల్లో మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుందన్నారు. అ లాగే మ్యాథ్స్ సబ్జెక్టులో పోటీ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలను విద్యార్థులకు నేర్పిస్తారని తెలిపారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లలో సమయాన్ని వృథా చేయవద్దని, చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. మారుమూల గ్రామం నుంచి వచ్చిన తాను విద్య వల్లనే నేడు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ స్థాయికి చేరుకున్నట్లు పు రుషోత్తం తెలిపారు. ఇప్పటికీ తమ గ్రామస్తులు ఆర్టీసీ బస్సును చూడలేదన్నారు. పురుషోత్తం యా దాద్రి భువనగిరి జిల్లా బొమ్మర రామారం మండలం గందమల్ల గ్రామానికి చెందిన వారు.
దేశాన్ని నడిపించేది అర్థశాస్త్రమే
దేశాన్ని నడిపించేది అర్థశాస్త్రమేనని రాష్ట్ర ఉన్నత వి ద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అప్లయిడ్ ఎకనామిక్స్ విభాగాధిపతి పున్నయ్య అధ్యక్షతన శుక్రవారం క్యాంపస్ కా మర్స్ అండ్ మేనేజ్‌మెంట్ కాలేజ్ సెమినార్ హాల్‌లో ‘రాష్ట్ర బడ్జెట్‌పై విశ్లేషణ’ అనే అంశంపై సెమినార్ ని ర్వహించారు. ఈసందర్భంగా వీసీ యాదగిరిరావు, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం, రిజి స్ట్రార్ యాదగిరి మాట్లాడారు. అనంతరం పురుషోత్తంను వీసీ, రిజిస్ట్రార్‌లు సత్కరించారు. ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, సెమినార్ కన్వీనర్ పున్నయ్య, కోకన్వీనర్ సంపత్, అధ్యాపకులు రవీందర్‌రెడ్డి, పా త నాగరాజు, స్వప్న, శ్రీనివాస్, దత్తహరి ఉన్నారు.
సర్టిఫికెట్స్ వస్తున్నాయి..
ఉద్యోగాలు రావడం లేదు..
ప్రణాళిక ప్రకారం సిలబస్
మార్పునకు శ్రీకారం
ప్రతి కోర్సుకు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి
రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం