కామారెడ్డి టౌన్: గ్రామపంచాయతీ సిబ్బందికి బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు బాలనర్సులు మాట్లాడుతూ గత తొమ్మిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు బి.సాయిలు, రూప్‌సింగ్, సాయి లు, కిషన్, కీర్తి, తదితరులు పాల్గొన్నారు.
పదో తరగతి విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం
దోమకొండ: పదోతరగతి విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నాయి. మండలంలోని అంబారిపేట గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 10 కిలోమీటర్ల దూరంలోని బీబీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం సెంటర్ పడింది. విద్యార్థులకు పరీక్ష రాయడానికి వీలుగా గ్రామానికి చెందిన యువకుడు అరుట్ల అనిల్ తన సొంత డబ్బులతో నాలుగు ఆటోలను ఏర్పాటు చేశాడు. ఉచిత ఆటో రవాణా సౌకర్యం కల్పించిన సదరు యువకుడిని పాఠశాల ఉపాధ్యాయుడు, గ్రామస్తులు అభినందించారు.
వేతనాలు చెల్లించాలని జీపీ కార్మికుల ధర్నా