కరీంనగర్: ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వకుండా గ్రామ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఓ మహిళ గ్రామపంచాయతీ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మొలంగూరు గ్రామపంచాయతీ ఎదుట శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పూస శివకుమారి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదు నెలలుగా గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగింది. కార్యదర్శి అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించింది.
శుక్రవారం ఇంటికోసం అనుమతి ఇవ్వాలని కార్యదర్శితో వాదనకు దిగింది. ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడ ఉన్న కొందరు ఆమెను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది శివకుమారి నుంచి వివరాలు సేకరించారు. ఈ విషయమై కార్యదర్శి మమతను వివరణ కోరగా శివకుమారి గురువారమే ఇంటిపత్రాలు అందించిందని తెలిపారు. అనుమతి ఇచ్చేందుకు 15రోజుల సమయం పడుతుందని చెప్పినప్పటికీ వినిపించుకోలేదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment