ట్రేడ్ లైసెన్స్‌లపై దృష్టి పెట్టండి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ట్రేడ్ లైసెన్స్‌ల జారీపై దృష్టి సారించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయం శానిటేషన్ విభాగం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ట్రేడ్‌లైసెన్స్‌లు జారీ చేసి న దుకాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. మళ్లీ కొలతలు తీసుకోవాలని, తేడాలున్నట్లు తేలితే 25శాతం జరిమానా విధించాలన్నారు. ప్రతి దుకా ణదారు ట్రేడ్‌లైసెన్స్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య పనులు మరింత మెరుగు పరచాలన్నారు. చెత్త కలెక్షన్ పాయింట్లు, బిన్స్ వద్ద పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అండర్ గ్రౌండ్ బిన్స్ ఉన్న చోట డంపర్ బిన్స్ తొలగించి, చెత్త ఎక్కువ పడవేసే ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నారు. సహాయ కమిషనర్ వేణు మాధవ్, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు వైద్యుల శ్రీధర్, గట్టు శ్రీనివాస్, వెంకన్న, మహేందర్, నరోత్తమ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
● నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్
Comments
Please login to add a commentAdd a comment