కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ‘అల్ఫోర్స్’ నరేందర్‌రె
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మెదక్, నిజామాబాద్, ఆది లాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందర్‌రెడ్డి పేరు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే ఆమోదించినట్లు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ పరంగా గుర్తులు లేనప్పటికీ, పార్టీ మద్దతుతో అభ్యర్థులు పోటీపడుతారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం నరేందర్‌రెడ్డితో పాటు, ప్రసన్న హరికృష్ణ, వెలిచాల రాజేందర్‌రావు తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. చివరకు ఏఐసీసీ నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ప్రకటించినందున ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులకు నరేందర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తన చారిత్రాత్మక గెలుపుతో సోనియాగాంధీకి బహుమతి అందజేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి
కరీంనగర్: పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వెంకటేశ్ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ, మహిళా సాధికారిక కేంద్రం ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై ఓరియంటేషన్ ప్రోగ్రాం శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్ మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం ప్రతిసంస్థ బాధ్యత అని, లైంగిక వేధింపులు ఎదురైనప్పు డు బాధితులు న్యాయ సహాయం ఎలా పొందవచ్చు అనే అంశాలను వివరించారు. మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి సబిత మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం అన్నారు. డీఈవో జనార్దన్‌రావు, లోకల్ కంప్లైంట్ కమిటీ చైర్‌పర్సన్ సుజాత, సభ్యులు అడ్వోకేట్ రాజారెడ్డి, అడిషనల్ డీఆర్డివో సునీత, జీసీడీవో కృపారాణి, గంగాధర సీడీపీవో కస్తూరి, హుజూరాబాద్ సీడీపీవో సుగుణ పాల్గొన్నారు.
యోగా సంఘాలను పటిష్టం చేయాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యోగా అసోసియేషన్లను పటిష్టం చేయాలని తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ కోరారు. కరీంనగర్‌లోని ఓ హోటల్లో శుక్రవారం తెలంగాణ యోగా అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. రవీందర్ సింగ్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో తెలంగాణ క్రీడాకారులు విశేషంగా రాణించడం సంతోషకరం అన్నారు. మొదటిసారి జా తీయస్థాయి జూనియర్స్ విభాగంలో బంగారు పతకం సాధించిన పురాణం దీపక్‌ను అభినందించారు. రాష్ట్రస్థాయి యోగా పోటీలను వచ్చేనెలలో నిజామాబాద్‌లో నిర్వహించేందుకు అసోసియేషన్ తీర్మానం చేసింది. అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్‌ఎన్.రెడ్డి, యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు జాల మనోహర్, జిల్లా ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సీహెచ్.గంగాధర్, జగిత్యాల కార్యదర్శి టి.మనోజ్ కుమార్, నిర్మల్ కార్యదర్శి పి.రవీందర్ పాల్గొన్నారు.
నేడు నూతన చట్టాలపై అవగాహన
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు నేడు నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ. రాజ్ కుమార్ తెలిపారు. ముఖ్యఅతిథిగా రిటైర్డ్ జడ్జి కె.అజిత్ సింహరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ హాజరు అవుతున్నట్లు తెలిపారు. జ్యోతినగర్‌లోని ఎం కన్వెన్షన్‌హాల్లో ఉదయం 9గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగే కార్యక్రమంలో న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment