ఉమెన్స్ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలు
కరీంనగర్ సిటీ: కరీంనగర్ మహిళ డిగ్రీ కాలేజీ డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ఫలితాలను ప్రిన్సిపాల్ డి.వరలక్ష్మి శుక్రవారం విడుదల చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ న్యూఢిల్లీ నుంచి స్వయం ప్రతిపత్తి హోదా పొందిన తర్వాత మొదటిసారి నిర్వహించిన మొదటి సంవత్సరం సెమిస్టర్ ఫలితాలు ఇవీ. మొత్తం 812 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా.. 481మంది ఉత్తీర్ణత సాధించారు. బీఏలో 47.74శాతం, బీకాంలో 70.25శాతం, బీఎస్సీ లైఫ్ సెన్సెస్‌లో 48.46శాతం, బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌లో 60.94శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జేవీ.రాజిరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారులు జి.శ్రీనివాస్, సతీశ్, కో– ఆర్డినేటర్లు ఎన్.మనోజ్‌కుమార్, రజిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment