మహిళల సంక్షేమానికే శుక్రవారం సభ
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: మహిళలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు శుక్రవారంసభ నిర్వహిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్‌లోని జగ్జీవన్‌రావుకాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ ఏర్పాటు చే శారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మహిళలతో మాట్లాడారు. మహిళలు తమ భోజనంలో అన్ని పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలన్నారు. గర్భిణులు కాల్షియం, ఐరన్ మాత్రలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాస్పత్రిలో ఉచిత వైద్యసేవలతో పాటు మందులు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. అనంతరం మెడికల్ క్యాంపును పరిశీలించారు.
ప్రాథమిక పాఠశాల సందర్శన
కిసాన్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఉచితంగా షూ పంపిణీ చేస్తామని తెలిపారు. డీడబ్ల్యూవో సబిత, మెప్మా పీడీ వేణుమాధవ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుజాత పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
శంకరపట్నం: పెళ్లి బరాత్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన బాకారపు ఉమ (35) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్సై రవి తెలిపారు. మండలంలోని మెట్‌పల్లి గ్రామానికి చెందిన బాకారపు ప్రభా కర్ కూతురు నవ్య వివాహం మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన జినుక అశోక్‌తో గురువారం జరిగింది. రాత్రి పెళ్లి బరాత్ జరుగుతుండగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లకు చెందిన కారు డ్రైవర్ శ్రవణ్ కారు దిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. బరాత్‌లో కొందరు డ్యాన్స్ చేస్తుండగా పెళ్లికొడుకు అశోక్ కారు నడిపాడు. ఒక్కసారిగా బాకారపు ఉమ, ఆమె కూతురు నిఖితతోపాటు మరి కొందరిని కారు ఢీకొనడంతో గాయపడ్డారు. తీవ్రగాయాలైన ఉమ, నిఖితను హుజూ రాబాద్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఉమ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి పెళ్లి కొడుకు జినుక అశోక్ కారణమంటూ ఉమ భర్త పర్శరాములు కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారికి పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకటి, ఎస్సై రవి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment