కాలువలో గల్లంతైన మహిళ మృతదేహం లభ్యం
కోరుట్లరూరల్: మండలంలోని మోహన్‌రావుపేట గ్రామానికి చెందిన పూదరి దేవక్క (70) మృతదేహం మల్యాల మండలం మానాల శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌లో లభ్యమైంది. శుక్రవారం దేవక్క మేడిపెల్లి మండలం వల్లంపెల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. దేవక్క బంధువులు, పోలీసులు కెనాల్ వెంట గాలించగా ఆదివారం ఉదయం మృతదేహాన్ని మానాల శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌లో గుర్తించి కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవక్కకు మతిస్థిమితం సరిగా లేదని ఆమె భర్త పూదరి నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గోదావరినదిలో..
రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ సమీప గోదావరినదిలో ఆదివారం ఓ వ్యక్తి(సుమారు 40 ఏళ్ల పురుషుడు) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి మంచిర్యాల లేదా నస్పూర్ ప్రాంతానికి చెందినవాడుగా భావిస్తున్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మార్చురీలో భద్రపరిచారు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే సెల్ నంబరు 87126 56527కు సమాచారం అందించాలని ఎస్సై వెంకటస్వామి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment