షార్ట్ సర్క్యూట్‌తో ఆస్తినష్టం
మల్యాల(చొప్పదండి): షార్ట్ షర్క్యూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగి సామగ్రి పూర్తిగా కాలిపోయిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సట్ట లత తన కుమారుడితో కలిసి ఇంట్లో నిద్రిస్తోంది. సోమవారం వేకువజామున సుమారు 3.30గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో తల్లి, కుమారుడు బయటకు పరుగులు తీశారు. మంటలు అంటుకుని ఇంట్లోని ఫర్నీచర్, టీవీ, రెండు తులాల బంగారం, మంచాలు, రూ.రెండువేలు కాలిబూడిదయ్యాయి. స్థానికులు 100కు డయల్ చేయడంతో బ్లూకోల్ట్స్ సిబ్బంది మధుసూదన్ రెడ్డి, సంపత్ సంఘటనా స్థలానికి వెళ్లి, ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పివేశా రు. పరిసరాలకు మంటలు వ్యాపించకుండా స్థానికులు నీళ్లుపోసి మంటలను ఆర్పివేశారు. షార్ట్ స ర్క్యూట్‌తో సుమారు రూ.3లక్షల విలు వైన ఆస్తి నష్టపోయినట్లు బాధితులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో కాలిపోయిన ఫర్నీచర్
Comments
Please login to add a commentAdd a comment