ధర్మారంలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ సీజ్
ధర్మారం(ధర్మపురి): మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌ను జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్న కుమారి సోమవారం రాత్రి సీజ్ చేశారు. వైద్యురాలు లావణ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులక్రితం ఆస్పత్రిని తనిఖీ చేయగా అనేక అవకతకవలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హెచ్చరిక నోటీసు జారీచేశామని, అయినా, యాజమాన్యం పట్టించుకోలేదని, సామాన్యులను బిల్లుల పేరిట దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కానింగ్ యంత్రంలోని హార్డ్‌డిస్క్‌ను మాయం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు రికార్డులను సైతం మాయం చేశారని మండిపడ్డారు. 9 పడకలకు బదులు 20 పడకలతో ఆస్పత్రి నిర్వహిస్తున్నారని ఆమె వివరించారు. పేషెంట్లకు అవసరం లేకున్నా విలువైన అంటీబయాటీక్ మందులను ఇస్తున్నారని ఆమె తెలిపారు. తన పరిశీలనలో అనేక అవకతవకలు వెలుగులోకి రావడంతో ఆస్పత్రిని సీజ్ చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో ప్రకటించారు. నివేదికను కలెక్టర్‌కు పంపిస్తామని ఆమె వెల్లడించారు. జిల్లా వైద్యాధికారితో పాటు డీఈఎంవో వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment