పునరావాసం కల్పించండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో అజ్ఞాత దళసభ్యుడిగా పనిచేసి ప్రభుత్వానికి లొంగిపోయిన ఓ మాజీ నక్సలైట్ తనకు పునరావాసం కల్పించి ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈమేరకు సోమవారం తనకు పునరావాసం కల్పించాలని కోరుతూ.. ప్రజావాణిలో కలెక్టర్‌ను కోరా రు. వీర్నపల్లి మండలం అడవిపదిరకు చెందిన ఉ త్తం శ్రీనివాస్ ఉరఫ్ సాగర్ అనే మాజీ నక్సలైట్ ఎ ల్లారెడ్డిపేటలో సోమవారం విలేకరులతో మాట్లాడా రు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని కామారెడ్డి, బా న్సువాడ, బిచ్కుంద దళాల్లో పనిచేస్తూ అప్పటి ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పిలుపుమేరకు అజ్ఞా తం వీడి జనజీవన స్రవంతిలో కలిసినట్లు పేర్కొన్నారు. పలు కేసుల్లో ఏళ్లకేళ్లు జైలు జీవితం గ డిపినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు లొంగిపోయిన నక్సలైట్లకు ఇచ్చే పునరావాసం కింద తనకు ఎలాంటి ఆర్థికసాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చే శాడు. మేకల కాపరిగా పనిచేస్తూ కుటుంబాన్ని పో షించుకుంటున్నట్లు తెలిపాడు. తన భార్య సుగుణ వ్యవసాయ కూలీగా పనిచేస్తుందన్నారు. తనకు ప్రభుత్వం నుంచి పునరావాసం వచ్చేలా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి కృషి చేయాలని కోరారు.
మాజీ నక్సలైట్ శ్రీనివాస్ వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment