ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): మండలంలోని తాండ్య్రాల గ్రామానికి చెందిన కాసారపు రాజగంగు (50) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజగంగు గ్రామంలో ఉంటూ బీడీలు చుడుతుంది. భర్త, కుమారుడికి సరైన పని లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. మనస్తాపానికి గురైన రాజగంగు సోమవారం మధ్యాహ్నం ఇంట్లోనే ఉరేసుకుంది. రాజగంగు తల్లి మామిడిపల్లి మల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మల్లాపూర్ : మండలంలోని ముత్యంపేటలో శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెట్‌పల్లి పట్టణానికి చెందిన గోనెల రాజ్‌కుమార్(28) మృతి చెందాడని మెట్‌పల్లి సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం మెట్‌పల్లికి చెందిన రాజ్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం మండలంలోని రాఘవపేటలో ఓ శుభకార్యానికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా.. ముత్యంపేట శివారులో అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్‌ను స్థానికులు, కుటుంబసభ్యులు నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
వాహనం అదుపుతప్పి..
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని గూడెం శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం కొండాపూర్‌కు చెందిన నాగెల్లి భూదయ్య(57) తన బైక్‌పై ముస్తాబాద్ వైపు వస్తున్నాడు. గూడెం ప్రధాన రోడ్డు మూలమలుపు వద్ద భూదయ్య వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ భూదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సెప్టిక్‌ట్యాంక్‌లో పడి..
రాయికల్: పట్టణానికి చెందిన చిలువేరి కిరణ్‌కుమార్ (54) ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్‌లో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధీర్‌రావు తెలిపారు. కిరణ్‌కుమార్ మద్యానికి బానిసై పట్టణ శివారులోని ఇంటి మెట్ల కింద నిర్మించిన సెప్టిక్ ట్యాంక్‌లో పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment