కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
కరీంనగర్‌కార్పొరేషన్: బీసీలకు స్థానికసంస్థల్లో, విద్యా, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో సంబురాలు నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అసెంబ్లీ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పేరుతో సంక్షేమ పథకాన్ని ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్‌కుమార్, ఎస్టీసెల్ అధ్యక్షుడు బానోతు శ్రావణ్ నాయక్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబురాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment