ప్రాజెక్టులకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు పెద్దపీట

Published Thu, Mar 20 2025 1:46 AM | Last Updated on Thu, Mar 20 2025 1:44 AM

ప్రాజ

ప్రాజెక్టులకు పెద్దపీట

కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ

రూ.101 కోట్లు

స్పోర్ట్స్‌ స్కూల్‌ వరంగల్‌–

కరీంనగర్‌ రూ.41 కోట్లు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

రాష్ట్ర బడ్జెట్‌ 2025–26లో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులకే పెద్దపీట వేసింది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు, తాయిలాల ప్రకటనకు ఈసారి ప్రభుత్వం దూరంగా ఉంది. ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, పాత ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులకు పెద్దపీట వేసింది. కాళేశ్వరం, ఎల్లంపల్లి, వరదకాల్వల నిర్వహణకు నిధుల విడుదల చేయడం ఇందుకు నిదర్శనం. అదే సమయంలో పత్తిపాక ప్రాజెక్టుపై ప్రకటన లేకపోవడం, జగిత్యాల మెడికల్‌ కాలేజీ నిధులు, ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీకి మిగిలిన బకాయిల ప్రస్తావన లేకపోవడం గమనార్హం. శాతవాహన వర్సిటీకి, కరీంనగర్‌ స్మార్ట్‌సిటీకి నిధులు కేటాయించిన ప్రభుత్వం.. మానేరు రివర్‌ఫ్రంట్‌కు నిధులు కేటాయించకపోవడం విశేషం. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్‌లో రూ.2,685 కోట్లు ప్రగతిపద్దులో కేటాయించడం చెప్పుకోదగిన అంశం.

కేటాయింపులు ఇలా..

● శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) నుంచి మిడ్‌మానేరును కలిపే వరద కాల్వకు రూ.299.16 కోట్లు పూర్తి కాని పనుల కోసం వాడనున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రూ.349.66 కోట్లు స్టేజ్‌–2లో పూర్తిచేయాల్సిన పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు.

● మానేరు ప్రాజెక్టుకు రూ.లక్ష, బొగ్గులవాగు (మంథని): రూ.34 లక్షలు, రామడుగు, గోదావరి బేసిన్‌: రూ.2.23 కోట్లు, చిన్న కాళేశ్వరం రూ.0, కాళేశ్వరం రూ.2,685 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. ఈ నిధులను పలుఅభివృద్ధి పనులకు వినియోగించనున్నారు. కానీ.. అంతా ఆశించిన పత్తిపాక ప్రాజెక్టు ప్రస్తావన లేకపోవడం ఉమ్మడి జిల్లా వాసులను నిరాశకు గురిచేసింది.

● శాతవాహన యూనివర్సిటీకి రూ.35 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర క్రీడా విద్యాలయాలైన కరీంనగర్‌–వరంగల్‌లకు కలిపి రూ.41 కోట్లు ప్రకటించింది.

● అదే సమయంలో కరీంనగర్‌లోని ప్రతిష్టాత్మక మానేరు రివర్‌ ఫ్రంట్‌ (ఎంఆర్‌ఎఫ్‌) కోసం ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు. మొత్తం రూ.800 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు వాస్తవానికి ఈఏడాది మేలో పూర్తవాల్సి ఉంది. గత ప్రభుత్వం రెండు విడదలుగా ఒకసారి రూ.310 కోట్లు మరోసారి రూ.234 కోట్లు మొత్తం కలిపి రూ.545 కోట్ల పైచిలుకు నిధులు విడుదల చేసింది. దీనికి టూరిజం వాళ్లు మరో రూ.100 కోట్లు కలపాల్సి ఉంది. కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవడం, కొత్త కేటాయింపులు లేకపోవడం, సాంకేతిక కారణాల వల్ల ప్రాజెక్టులో జాప్యం నెలకొంది. గతంలో రూ.210 కోట్లు విడుదలవగా, ఇటీవల మరో రూ.130 కోట్ల వరకు విడుదలయ్యాయని తెలిసింది.

● కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు రూ.101 కోట్లు ఇస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో రామగుండం, కరీంనగర్‌ కార్పొరేషన్లకు సాయం కింద ఏమీ కేటాయించలేదు.

● ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.12,500 కోట్లు కేటాయించింది. పథకంలో భాగంగా ప్రతీ నియోజకవర్గంలో 3500 మంది లబ్ధిదారుల చొప్పున ప్రతీ ఒక్కరికీ రూ.5 లక్షల వరకు ప్రభుత్వం సాయం చేయనుంది. ప్రస్తు తం కేటాయింపుల ప్రకారం..చూసినపుడు119 నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గంలో దాదా పు 2100 ఇండ్లకే ఈ సాయం సరిపోతుంది.

● ఇక ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, కొండగట్టులకు ఎలాంటి ప్రకటన లేకపోవడం భక్తులను నిరాశకు గురిచేసింది.

● కీలకమైన కాకతీయ కాల్వల ఆధునికీకరణ, కల్వల ప్రాజెక్ట్‌ లకు నిధులు ఇవ్వకపోవడంపైనా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల పనులకే నిధులు

ఎల్లంపల్లికి రూ.349 కోట్లు, వరదకాల్వకు రూ.299 కోట్లు

కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.2,685 కోట్లు

మానేరు రివర్‌ ఫ్రంట్‌కు రిక్తహస్తమే

శాతవాహన యూనివర్సిటీకి రూ.35 కోట్లు

కరీంనగర్‌ స్మార్ట్‌సిటీకి రూ.101 కోట్లు

2025–26 బడ్జెట్‌లో కానరాని కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రాజెక్టులకు పెద్దపీట1
1/10

ప్రాజెక్టులకు పెద్దపీట

ప్రాజెక్టులకు పెద్దపీట2
2/10

ప్రాజెక్టులకు పెద్దపీట

ప్రాజెక్టులకు పెద్దపీట3
3/10

ప్రాజెక్టులకు పెద్దపీట

ప్రాజెక్టులకు పెద్దపీట4
4/10

ప్రాజెక్టులకు పెద్దపీట

ప్రాజెక్టులకు పెద్దపీట5
5/10

ప్రాజెక్టులకు పెద్దపీట

ప్రాజెక్టులకు పెద్దపీట6
6/10

ప్రాజెక్టులకు పెద్దపీట

ప్రాజెక్టులకు పెద్దపీట7
7/10

ప్రాజెక్టులకు పెద్దపీట

ప్రాజెక్టులకు పెద్దపీట8
8/10

ప్రాజెక్టులకు పెద్దపీట

ప్రాజెక్టులకు పెద్దపీట9
9/10

ప్రాజెక్టులకు పెద్దపీట

ప్రాజెక్టులకు పెద్దపీట10
10/10

ప్రాజెక్టులకు పెద్దపీట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement