తడికోసం తండ్లాట
‘కల్వల’కు గండి కోత
గండి పడడంతో దిగువనకు వెళ్తున్న నీరు
శంకరపట్నం:మండలంలోని కల్వల ప్రాజెక్టుకు రైతులు తాత్కాలికంగా వేసిన కట్టకు బుధవారం వేకువజామున గండి పడింది. నీరంతా దిగువనకు వృథాగా పోతోంది. కల్వల ప్రాజెక్టు మత్తడికి 2023 జూలై 28న గండిపడగా.. రింగ్‌బండ్‌కు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.9లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో రింగ్‌బండ్ వేసినా కొన్ని నెలలకే గండి పడింది. రైతులు సొంత ఖర్చులతో తాత్కాలిక కట్ట పోశారు. ఇటీవల గండిపడగా వీణవంక, శంకరపట్నం మండలం కాచాపూర్, గద్దపాక, కల్వల గ్రామాల రైతులు మరమ్మతు చేశారు. రెండ్రోజుల క్రితం ఎస్సారెస్పీ కాలువ ఎస్కేప్ గేట్లను ఎత్తి నీటిని ప్రాజెక్ట్‌లోకి వదలడంతో బుధవారం కట్టకు గండి పడింది. తాత్కాలిక కట్టతో ప్రాజెక్టులో కొంతమేర నీరు ఉంటే పంటలకు వాడుకున్నామని, గండి పడడంతో చివరి దశలో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మానకొండూర్: జిల్లాలోని మానకొండూర్ మండలం ఖాదర్‌గూడెం వ్యవసాయ గ్రామం. వరి, కూరగాయలు ఇక్కడ ప్రధాన పంటలు. చిన్న గ్రామమైనా 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములున్నాయి. ఈ భూముల్లో పంటల సాగుకు పటేల్‌కుంటే ఆధారం. కుంట ఎగువన ఎంఎంఆర్–4 ఉపకాలువ, దిగువన ఎస్సారెస్పీ కాలువ నిండుకుండలై పారుతున్నా.. కుంటలోకి చుక్కనీరు చేరడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. ఎంఎంఆర్–4 ఉపకాలువకు గండి పెట్టారు. కాలువ నుంచి పటేల్‌కుంట వరకు కందకం తవ్వారు. కుంటలోకి కాలువ నీరు తరలిస్తున్నారు. తద్వారా పంటలకు జీవం పోస్తున్నారు. ఏటా ఇదే ప్రయత్నం చేస్తున్నారు. కుంటలోకి కాలువ నీరు చేరేలా శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ‘పటేల్‌కుంట నిండితేనే పంటలు పండుతాయని, కుంటలోకి సాగునీరు చేరడం లేదని రైతులు నా దృష్టికి తెచ్చారు. కాలువ డిజైన్‌లో ప్రతీకుంట నిండేలా చర్యలు తీసుకుంటాం. పూర్తిస్థాయిలో కాలువలు తవ్వడం కాలేదు. కుంటలోకి సాగునీరు వెళ్లేలా కాలువ నుంచి తూము ఉంటుంది. అది ఎక్కడ ఏర్పాటు చేస్తే సాగునీరు కుంటలోకి వెళ్తుందో సర్వే చేస్తాం. ఈ వేసవిలో కాలువల తవ్వకాలు చేపడతాం’ అని డీఈ సదానందం వివరించారు.
తడికోసం తండ్లాట
తడికోసం తండ్లాట
Comments
Please login to add a commentAdd a comment