భవిష్యత్‌ను చాలెంజ్‌గా తీసుకోవాలి
హుజూరాబాద్: విద్యార్థులు భవిష్యత్‌ను చాలెంజ్‌గా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మండలంలోని సింగాపూర్ గ్రామంలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో కళాశాల డైరెక్టర్ కె.శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కిట్సోజెన్– 25 క్రీడా సాంస్కృతిక ఉత్సవ ప్రారంభ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ అభ్యున్నతికి ఇంజినీరింగ్ విద్యార్థుల సేవలు అవసరం అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీపడి చదవాలన్నారు. కళాశాల చైర్మన్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. కళాశాలలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం క్రీడా పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కళాశాల సెక్రటరీ వొడితల సతీశ్‌కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఈశ్వరయ్య పాల్గొన్నారు.
రూరల్ ఏసీపీ ఆఫీస్ తనిఖీ
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని గురువారం సీపీ గౌస్ ఆలం సందర్శించారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు. త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అర్బన్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సైబర్‌నేరాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్లు అమలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. గంజాయి, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ పాల్గొన్నారు.
ముగిసిన ఇంటర్ పరీక్షలు
కరీంనగర్: ఇంటర్ పరీక్షలు ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా జనరల్, ఒకేషనల్ విభాగాల్లో 15,554 మంది విద్యార్థులకు 422 విద్యార్థులు గైర్హాజరు కాగా 15,132 మంది పరీక్షకు హాజరైనట్లు గురువారం డీఐఈవో జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. చివరిరోజు హుజూరాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకరు డిబార్ అయినట్లు వివరించారు. మరోవైపు పరీక్షలు ముగిసిన వెంటనే కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. కేరింతలు కొడుతూ జోష్‌గా కనిపించారు. పిల్లలను తీసుకెళ్లేందుకు ఆయా కళాశాలలు, హాస్టళ్ల వద్దకు తల్లిదండ్రులు చేరుకున్నారు. దీంతో ప్రధాన వీధుల్లో ఆటోలు, బస్సుల్లో రద్దీ నెలకొంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ జనంతో కిక్కిరిసింది.
ఐదుగురు ఎస్సైల బదిలీ
కరీంనగర్ క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధి లో ఐదుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. స్పెషల్ బ్రాంచిలో పనిచేస్తున్న వంశీకృష్ణ గంగాధర ఎస్సైగా, కరీంనగర్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసే రాజు రామడుగుకు, కరీంనగర్ ట్రాఫిక్‌లో విధులు నిర్వహిస్తున్న సురేందర్ చొప్పదండికి, రామడుగులో పనిచేస్తున్న శేఖర్ వీఆర్‌కు, గంగాధరలో విధులు నిర్వహిస్తున్న నరేందర్ రెడ్డిని వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సిటీలో పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున శుక్రవారం మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 11 కేవీ ఉజ్వల పార్కు, ఐటీ హబ్ ఫీడర్ పరిధి లోని కోతిరాంపూర్ మెయిన్‌రోడ్, కోతిరాంపూర్, బైపాస్‌రోడ్డు, హనుమాన్‌నగర్, ఎమ్మెల్సీ హనుమాన్‌నగర్, గణేశ్‌నగర్, పాలిటెక్నిక్ కళాశాల, డీమార్ట్, ఐటీ హబ్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు 11 కేవీ కోర్టు ఫీడర్ పరిధిలోని క్రోమా, వివేకానంద స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని టౌన్ 1 ఏడీఈ పి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.
భవిష్యత్‌ను చాలెంజ్‌గా తీసుకోవాలి
భవిష్యత్‌ను చాలెంజ్‌గా తీసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment