నక్సల్స్‌పై కేంద్ర వైఖరి సరైంది కాదు
గోదావరిఖని: నియోజకవర్గాల పునర్విభజన మూలంగా దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, నక్సల్స్‌పై కేంద్ర వైఖరి సరైంది కాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. స్థానిక భాస్కర్‌రావు భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో నక్సలిజాన్ని, కమ్యూనిస్టులను రూపుమాపడానికి కేంద్ర చేస్తున్న నిరంకుశత్వ విధానం సరైంది కాదన్నారు. సమావేశంలో నాయకులు కలవేన శంకర్, తాండ్ర సదానందం, కె.కనకరాజ్, గోషిక మోహన్, గౌతం గోవర్ధన్, తాళ్లపెల్లి మల్లయ్య, మడికొండ ఓదెమ్మ, కోడం స్వామి, మాటేటి శంకర్, అసాల రమ, కందుకూరి రాజరత్నం, మార్కాపురి సూర్య, కుమార్, రేణికుంట్ల ప్రీతం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment