వ్యర్థాల ప్రాసెసింగ్‌తోనే స్వచ్ఛ నగరం
● కలెక్టర్, నగరపాలక ప్రత్యేకాధికారి పమేలా సత్పతి
కరీంనగర్ కార్పొరేషన్: వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే చోట ప్రాసెసింగ్ చేయడం ద్వారానే స్వచ్ఛ కరీంనగర్ సాధ్యమవుతుందని కలెక్టర్, నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారి పమేలా సత్పతి పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా శుక్రవారం నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో బల్క్ ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఎక్స్‌పో నిర్వహించారు. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు,ఫంక్షన్‌హాళ్లు, హాస్ట ళ్లు, అపార్ట్‌మెంట్లు తదితర నిర్వాహకులకు ఆధునాతన సేంద్రీయ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎక్స్‌పోను ప్రారంభించిన కలెక్టర్, వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. వ్యర్థాల ద్వారా ఎరువులు తయారు చేయొచ్చని, తద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామన్నారు. కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ మాట్లాడుతూ తడి పొడి చెత్తను వేరు చేసి ప్రాసెసింగ్‌కు పంపించాలన్నారు. చెత్త డంప్‌యార్డ్‌కు పోకుండా తగ్గించుకునేందుకు ఆధునాతన సేంద్రీయ వ్యర్థాల నిర్వహణ పద్దతులను అవలంభించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, నగరపాలకసంస్థ అదనపు కమిషనర్ సువార్త, సహాయ కమిషనర్ వేణుమాధవ్, పర్యావరణ ఇంజినీర్ స్వామి పాల్గొన్నారు.
క్రీడల్లో రాణించాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం అంబేద్కర్ స్టేడియంలోని స్విమ్మింగ్‌పూల్, ప్రాంతీయ క్రీడా పాఠశాలలోని స్విమ్మింగ్ పూల్, యోగాకేంద్రం, జిమ్నాస్టిక్స్, యోగా, అథ్లెటిక్స్, జూడో క్రీడలకు సంబంధించిన పరిసరాలను పరిశీలించారు. స్విమ్మింగ్‌పూ ల్ వద్ద ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటాలని సూ చించారు. విద్యార్థుల ప్రదర్శనను తిలకించారు. శిక్షణ కలెక్టర్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్, ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment