పోలీసుల అదుపులో ముదిరాజ్ నాయకులు
వేములవాడ/ముస్తాబాద్: ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏకు మార్చాలని కోరుతూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా.. జిల్లాలోని ముదిరాజ్ కుల సంఘం నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వేములవాడ ఠాణాకు ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, వేములవాడ టౌన్ ప్రెసిడెంట్ లాల దేవయ్య, జిల్లా యూత్ నాయకుడు రెడ్డవేని పరశురాంలను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. ముస్తాబాద్ పోలీసులు మత్స్యకార సొసైటీ జిల్లా డైరెక్టర్ గాడిచెర్ల దేవయ్యను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల ప్రయోజనానికి సొసైటీలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం అదే రీతిలో నిధులు కేటాయించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment