మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి
కరీంనగర్: దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేయాలని కుట్రచేస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు దేశ ప్రజలంతా సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి మాట్లాడారు. పార్లమెంటుస్థాయిలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకువచ్చి దక్షిణాది రాష్ట్రాలకుు తీరని అన్యాయం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న నరేంద్ర మోడీ అప్పుల దేశంగా మారుస్తున్నాడని, గతంలో రూ.80లక్షల కోట్ల అప్పు ఉంటే తాజాగా రూ.150 లక్షల కోట్ల అప్పుచేసి కార్పొరేటు వ్యవస్థలకు కొమ్ము కాస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కొంత ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇంకా అనేక హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, అందెస్వామి పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని సీపీఐ అభ్యర్థులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో శుక్రవారం కార్యవర్గసభ్యుడు బత్తుల బాబు అధ్యక్షతన జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సీపీఐకి గణనీయమైన చరిత్ర ఉందని, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారని, నేటికీ అనేక గ్రామాల్లో తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, సభ్యులు ఉన్నారని అన్నారు. అదే ఒరవడిని కొనసాగించేందుకు సీపీఐ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలిపారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment