రాములోరికి గోటి తలంబ్రాలు
జ్యోతినగర్(రామగుండం): కల్యాణం కోసం తలంబ్రాల తయారీకి సాధారణంగా మరపట్టిన బియ్యం వినియోగిస్తారు. కానీ, శ్రీసీతారాముల కల్యాణం కోసం గోటితో వొలిచిన తలంబ్రాలు వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలోనే ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలోని శ్రీసీతారామ సేవా సమితి సభ్యులు గోటితో వొలిచిన తలంబ్రాలను శ్రీసీతారామ కల్యాణం కోసం పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈఏడాది కూడా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏప్రిల్ 6న శ్రీరామ నవమి నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణోత్సవం కోసం మహిళలు గోటితో వొలిచిన తలంబ్రాలను పంపించి భక్తిని చాటుకుంటున్నారు. గోటితో కోటి తలంబ్రాలను వొలిచే ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీసీతారామ సేవా సమితి సభ్యులు కంది సుజాత, కొండు రమాదేవి, జనగామ రాజేశ్వరి, ఆలయ కమిటీ సభ్యుడు చెప్యాల సత్యానారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
కోటి తలంబ్రాలు ఒలిచే కార్యక్రమానికి శ్రీకారం
రాములోరికి గోటి తలంబ్రాలు
Comments
Please login to add a commentAdd a comment