‘పీఎం కుసుం’ను సద్వినియోగం చేసుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుం పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కోరారు. కరీంనగర్ విద్యుత్ భవన్‌లో రెడ్కో ఆధ్వర్యంలో పీఎం కుసుం పథకంపై శనివారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సోలార్ విద్యుత్‌తో పంప్‌సెట్ల ద్వారా పంటలు పండించుకోవచ్చునని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు మాట్లాడుతూ.. పీఎం కుసుం పథకం కింద ఎండబ్ల్యూ సోలార్ వపర్ ఫ్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చునని, 3–5 ఎకరాలున్న రైతులు అర్హులని తెలిపారు. ఐదు కిలోమీటర్ల లోపల సబ్‌స్టేషన్ దగ్గరున్న రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లీడ్ బ్యాంక్ అధికారి ఆంజనేయులు, కో అధికారి అజయ్ పాల్గొన్నారు.
పశు సంపద గ్రామీణాభివృద్ధికి మూలం
మానకొండూర్: పశు సంపద గ్రామీణాభివృద్ధికి మూలమని కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్థకశాఖ శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.లింగారెడ్డి తెలిపారు. నూతనంగా నియామకమయిన పశువైద్యాధికారులకు 45రోజుల శిక్షణలో భాగంగా మండలంలోని గట్టుదుద్దెనపల్లి, నిజాయతీగూడెంలో ఏర్పాటుచేసిన ఉచిత పశువైద్య శిబిరాలను శనివా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలానుగుణ వ్యాధుల నుంచి పశువులను కాపాడుకోవాలని సూచించారు. జిల్లా పశుగణన అభివృద్ధి సంస్థ అధికారి సత్య ప్రసాదరెడ్డి, శిక్షణాకేంద్రం అధ్యాపకులు ఎం.కోటేశ్వరరావు, సాయిచైతన్య, దివ్య, మానకొండూర్ పశువైద్యాధికారి సుష్మిత పాల్గొన్నారు.
నీటిబొట్టును ఒడిసిపడుదాం
కరీంనగర్‌సిటీ: నీరు వృథా కాకుండా ఒడిసిపట్టాలని కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల అకాడమిక్ కో– ఆర్డినేటర్ మనోజ్‌కుమార్ తెలిపారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కళాశాల జీవశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్‌కుమార్ మా ట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటు న్న పెను సవాళ్లలో నీటి సమస్య ఎంతో ముఖ్యమైందన్నారు. నీటిని పొదుపుచేయకుంటే రాబోవు తరాలకు నీరు లభించడం కష్టంగా మారుతుందని తెలిపారు. డాక్టర్ బి.తిరుపతి, ఆర్.దేవేందర్, సుజాత, అనిత, నారాయణ, రమ్య, ప్రియాంక, మౌనిక పాల్గొన్నారు.
జలం.. పొదుపుతో పదిలం
తిమ్మాపూర్: జీవుల మనుగడకు అవసరమైన జలాన్ని పరిరక్షించాలని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జిల్లా భూగర్భ జలశాఖ నేతృత్వంలో ఆదరణ సేవా సమితి సహకారంతో తిమ్మాపూర్ రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఏవో భాగ్యలక్ష్మి హాజరై మాట్లాడారు. ప్రతీ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లా భూగర్భ జలాధికారి శ్యామ్‌ప్రసాద్‌నాయక్, వ్యవసాయశాఖ అదనపు సంచాలకుడె శ్రీధర్ నీటి యాజమాన్య పద్ధతులను వివరించారు. ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని, భూగర్భ జలశాఖ సహాయ హైడ్రాలజిస్టు అభిలాష్, సీహెచ్.అఖిల, సూపరింటెండెంట్ రెహమాన్, ఏవోలు సురేందర్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్, కిరణ్మయి, రాజులునాయుడు పాల్గొన్నారు.
‘పీఎం కుసుం’ను సద్వినియోగం చేసుకోవాలి
‘పీఎం కుసుం’ను సద్వినియోగం చేసుకోవాలి
‘పీఎం కుసుం’ను సద్వినియోగం చేసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment