రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలనే మారుస్తారు
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
జమ్మికుంట/కరీంనగర్‌రూరల్: రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తే రాజకీయ పార్టీలకు పుట్టగతులుండవని, రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చేయగలరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. జమ్మికుంటలోని కేవీకేలో పత్తిసాగులో అధిక సాంద్రత విధానంపై నిర్వహించిన కిసాన్‌మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక అన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలను పక్కనబెట్టి, రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ఎఫ్‌పీవో వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జమ్మికుంట కేవీకేలో 105 మంది రైతులతో 208ఎకరాల్లో అధిక సాంద్రత పద్ధతిలో సాగుచేయడం వల్ల కేంద్రప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సాంకేతిక విజ్ఞాన అనుప్రయోగ సంస్థ డాక్టర్ షేక్‌ఎస్‌మీరా, జగిత్యాల ఏడీఆర్ శ్రీలత, కరీంనగర్ డీఏవో భాగ్యలక్ష్మి, శాస్త్రవేత్త వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
పంచాయతీ కార్మికులకు ఉత్తమ సేవలు
జిల్లాలోని గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు కలెక్టర్ ప్రత్యేకంగా అందిస్తున్న సేవలు బాగున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ అభినందించారు. శనివారం కరీంనగర్ మండలం చామనపల్లిలో ఉచిత మెగా వైద్యశిబిరం ప్రారంభించిన అనంతరం పారిశుధ్య కార్మికులకు ప్రత్యేకంగా వైద్యపరీక్షలు చేయించారు. కార్మికులకు హెల్త్‌కార్డులు, ఇన్సూరెన్స్, రక్షణ పరికరాలను అందించినట్లు పంచాయతీ కార్యదర్శి మహేందర్‌రావు సంజయ్‌కి వివరించారు. కార్మికులకు అందిస్తున్న సేవలు బాగున్నాయని కేంద్రమంత్రి ప్రశంసించారు. ఎంపీడీవో సంజీవరావు, ప్రత్యేక అధికారి జగన్మోహన్‌రెడ్డి, కార్యదర్శులు కిరణ్‌రావు, వెంకటేశ్వర్‌రావు, సుజాత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment