ఆర్టీసీ డిపోలో ట్రాక్టర్ పరికరాలు మాయం
కోరుట్ల: ఇసుక అక్రమ రవాణా కారణంగా కోరుట్ల ఆర్టీసీ డిపోలో ఉంచిన ట్రాక్టర్ నుంచి విడిభాగాలు మాయం కావడం ఆర్టీసీ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. వివరాలు.. ఫిబ్రవరి 24న అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్(టీఎస్ 21టీ 4499)ను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అనంతరం రూ.25 వేలు జరిమానా వేసి ట్రాక్టర్‌ను ఆర్టీసీ డిపోకు తరలించారు. ఈక్రమంలో ట్రాక్టర్ యజమాని సంగ గంగాధర్ రెండు రోజుల క్రితం జరిమానా కట్టి రెవెన్యూ అధికారుల నుంచి ట్రాక్టర్ రిలీజ్ ఆర్డర్ తీసుకుని ఆర్టీసీ డిపోకు వెళ్లగా సుమారు రూ.5 వేలు విలువైన ట్రాక్టర్ విడి భాగాలు కనిపించలేదు. డిపోలో ఉంచిన ట్రాక్టర్ నుంచి విడి భాగాలు ఎలా మాయమయ్యాయని ఆందోళన చెందిన గంగాధర్ రెండురోజుల క్రితం డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై డిపో మేనేజర్ మనోహర్ మాట్లాడుతూ, ఆర్టీసీ డిపోలో ఉన్న సమయంలో ట్రాక్టర్ విడి భాగాలు మాయమైనట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment