గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్
మెట్‌పల్లి(కోరుట్ల): ఓ వైపు కూలీ పని చేస్తూ.. మరోవైపు గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ నిరంజన్‌రెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన పోగుల అజయ్ కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం కోరుట్లకు వచ్చి విగ్రహాలు తయారు చేసే షాపులో పని చేస్తున్నాడు. శనివారం ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ అనిల్ సిబ్బందితో కలిసి మేడిపల్లి క్రాసింగ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, అజయ్ బైక్‌పై అటు వైపు వచ్చాడు. అక్కడ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వెంబడించి పట్టుకున్నారు. అనంతరం అతడి జేబులను పరిశీలించగా 300 గ్రాముల గంజాయి దొరికింది. గంజాయి, బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. గతంలో కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో ఒక గంజాయి, మరో రెండు ఇతర కేసుల్లో అజయ్ అరెస్ట్ అయినట్లు సీఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment