బైండోవర్ ఉల్లంఘించిన మహిళకు జరిమానా
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని అల్మాస్‌పూర్‌కు చెందిన ఓ మహిళ బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించడంతో శనివారం తహసీల్దార్ సుజాత జరిమానా విధించారు. ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. అల్మాస్‌పూర్‌కు చెందిన భూక్య జ్యోతి గతంలో నాటుసారా తయారు చేస్తూ ఎకై ్సజ్ అధికారులకు పట్టుబడింది. జ్యోతిని అరెస్ట్ చేసిన అధికారులు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. బైండోవర్ సమయంలో తిరిగి సాటుసారా తయారు చేయబోమని నగదు పూచీకత్తుపై అప్పటి తహసీల్దార్‌కు ఒప్పందపత్రం రాసి ఇచ్చారు. కాగా జ్యోతి మళ్లీ నాటుసారా తయారు చేసి విక్రయిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన జ్యోతిని ఎకై ్సజ్ అధికారులు శనివారం అరెస్ట్ చేసి తహసీల్దార్ ఎదుట హాజరుపర్చగా రూ.20వేలు జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. దాడిలో సిబ్బంది రాజేందర్, రాజు, మల్లేశ్, కిశోర్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment