నిందితులకు శిక్ష పడేలా చూడాలి
గోదావరిఖని(రామగుండం): నిందితులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగేలా కోర్టు కానిస్టేబుళ్లు మానవత్వంతో మెదలాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్‌ఝా స్పష్టం చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో శనివారం కమిషనరేట్ మీటింట్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. నిందితులకు శిక్ష పడేలా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగేలా చూడాలన్నారు. నేరస్తులకు వారెంట్లు, సమన్లు సత్వరం ఎగ్జిక్యూట్ అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న ట్రయల్ కేసులు, వారెంట్లు, సమన్లు సీసీటీఎన్‌ఎస్‌లో డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటే మనపై నమ్మకం పెరుగుతుందన్నారు. కాగా కోర్టు డ్యూటీ విధుల్లో క్రమశిక్షణతో పనిచేస్తూ హత్య, హత్యాయత్నం, చీటింగ్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కృషిచేసిన, లోక్ అదాలత్ కేసుల్లో ప్రతిభ చూపిన అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు. అదనపు డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, లీగల్‌సెల్ సీఐ కృష్ణ, సీసీఆర్‌బీసీ సీఐ సతీశ్, ఐటిసెల్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్, సీసీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
రామగుండం సీపీ అంబర్ కిషోర్‌ఝా
Comments
Please login to add a commentAdd a comment