భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు
జగిత్యాల: హనుమాన్ చిన్న జయంతికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి కొండగట్టు ఆంజనేయస్వామి జయంతి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భక్తులకు తాగునీరు, మొబైల్ టాయిలెట్స్ తదితర వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో నిత్యం శానిటేషన్ నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 11 నుంచి 13 వరకు నిర్వహించే హనుమాన్ చిన్న జయంతికి ఇప్పటి నుంచే అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment