చెట్టుకొమ్మలు కొడుతుండగా..
బోయినపల్లి(చొప్పదండి): చెట్టు కొమ్మలు కరెంట్ తీగలపై పడుతున్నాయని.. కొమ్మలు కొట్టే ప్రయత్నంలో ఓ కొమ్మ మేయిన్ విద్యుత్ తీగపై పడి మండలంలోని మాన్వాడ గ్రామానికి చెందిన దాసరి నర్సయ్య (58) విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ తెలిపిన వివరాలు.. మాన్వాడకు చెందిన నర్సయ్య ఇంటి ముందు ఉన్న మునగ చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలపై పడుతున్నాయని శనివారం కొమ్మలు కొట్టడానికి చెట్టు ఎక్కాడు. కొమ్మలు కొడుతుండగా ఓ కొమ్మ విద్యుత్ మేయిన్ తీగపై పడడంతో నర్సయ్యకు విద్యుత్ షాక్ తగిలి చెట్టుపైనే మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
చెట్టుకొమ్మలు కొడుతుండగా..
Comments
Please login to add a commentAdd a comment