మంత్రపురికి ఆధ్యాత్మిక శోభ
మంథని: నిత్యం వేద ఘోషతో పరిఢవిల్లె మంత్రపు రి మరో అరుదైన ఘట్టానికి వేదిక కాబోతుంది. మంథనిలోని లక్ష్మీ నృసింహగార్డెన్‌లో ఆదివారం సామూహిక గీతా పారాయణం నిర్వహించనున్నా రు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పలువురు పీఠాధిపతులు హాజరుకానున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఐదువేల మందితో..
గతంలో ఎక్కడా లేని విధంగా మంథనిలో ఐదు వేల మందితో సామూహిక గీతా పారాయణం నిర్వహించనున్నారు. అయితే ప్రపంచంలోనే ఇలాంటి ఉత్సవం జరగలేదని సనాతనధర్మ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. భగవద్గీతను ఇంటింటా చేర్చడానికి ఐదేళ్ల క్రితం ఉద్యమం ప్రారంభం కాగా, 40 వేల మందికి చేర్చినట్లు ఇటీవల సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలోని 70 ప్రాంతాలకు చెందిన గీత పారాయణ భక్తులు హాజరుకానున్నారు. అలాగే తెలుగు సాహితీ వేత్త, భగవత్ గీత ప్రవచకులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతారు. మంథనిలోని శ్రీలక్ష్మీనారాయణ ఆలయం నుంచి ఉదయం 8.30 గంటలకు శోభాయాత్ర నిర్వహించిన అనంతరం సామూహిక గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిసారు.
30 నుంచి శ్రీరామ నవరాత్రోత్సవాలు
వేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు శ్రీరామ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో వినోద్‌రెడ్డి శనివారం తెలిపారు. రోజూ ఉద యం 6.30 గంటలకు స్వామివారికి, సీతారామచంద్ర స్వామికి, పరివార అనుబంధ ఆలయాల్లో ప్ర త్యేక పూజలు నిర్వహిస్తారు. 30న ఉగాది పండుగ పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు, సాయంత్రం 4.30 గంటలకు పంచాంగ శ్రవణము, పండిత సత్కారం నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు స్వామివారి పెద్దసేవపై ఊరేగిస్తారు. ఏప్రిల్ 4 నుంచి 6 వరకు భక్తోత్సవం, 6న ఉదయం 11.55 గంటలకు సీతారామచంద్రస్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఈవో పేర్కొన్నారు. అదేరోజు సాయంత్రం పూర్ణాహుతి, రథోత్సవం, వసంతోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment