తాళం వేసిన ఇళ్లలో చోరీ
వెల్గటూర్: తాళంవేసిన ఇళ్లలో దొంగలు దొంగతనం చేసిన ఘటన మండలంలోని పైడిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని గుడికందుల తిరుపతి, రాజేశం ఇళ్లలో శనివారం రాత్రి దొంగలు పడి బీరువా తాళాలు పగులగొట్టారు. తిరుపతి ఇంట్లో రెండున్నర తులాల బంగారం, రాజేశం ఇంట్లో నుంచి రూ.80వేలు ఎత్తుకెళ్లారు. తిరుపతి వ్యాపార నిమిత్తం కరీంనగర్‌లో, రాజేశం ముంబయిలో ఉంటున్నారు. వారిళ్లలో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు చొరబడి బంగారం, నగదు దోచుకెళ్లారు. ఆదివారం ఉదయం ఇరుగుపొరుగు వారు చూసి ఇంటి యజమానులకు సమాచారం ఇచ్చారు. వారువచ్చి చూసి బీరువా తాళాలు పగుల గొట్టి ఉండడం, అందులో బంగారం, నగలు దొంగలు దోచుకెళ్లినట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్‌ను, క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment