తాగునీటికి తండ్లాటే.. | - | Sakshi
Sakshi News home page

తాగునీటికి తండ్లాటే..

Published Wed, Mar 26 2025 12:40 AM | Last Updated on Wed, Mar 26 2025 12:42 AM

తాగున

తాగునీటికి తండ్లాటే..

కరీంనగర్‌
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025
● ఎల్‌ఎండీలో పడిపోతున్న నీటిమట్టం ● కొద్ది రోజుల్లోనే ప్రతీరోజు సరఫరాకు ఫుల్‌స్టాప్‌ ● ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోజు విడిచి సరఫరా ● కొన్ని డివిజన్లలో రంగు మారుతున్న నల్లానీళ్లు
‘దళితబంధు’ విడుదల చేయండి
ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం చేయండి

7

క్వింటాల్‌ పత్తి రూ.7,240

జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తి రూ.7,240 పలికింది. మంగళవారం మార్కెట్‌కు 10 వాహనాల్లో 165క్వింటాల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్‌ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.7,150 పలికింది.

ప్రస్తుతం తాగునీటి సరఫరా జరుగుతున్న తీరు

హౌసింగ్‌బోర్డు రిజర్వాయర్‌: 24 గంటలు

అంబేడ్కర్‌, రాంపూర్‌: రోజు విడిచి రోజు(కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులకోసారి)

కోర్టు, మార్కెట్‌: సవరన్‌స్ట్రీట్‌, వావిలాలపల్లి, క్రిస్టియన్‌కాలనీ

తదితర కాలనీల్లో రోజు విడిచి రోజు

భగత్‌నగర్‌, గౌతమినగర్‌, ఎస్‌ఆర్‌ఆర్‌, రాంనగర్‌, మల్కాపూర్‌: ప్రతీరోజు నీటి సరఫరా (వీటి పరిధిల్లోనూ కొన్ని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు)

నల్లా నీళ్లు

నీళ్లు సరిపోవడం లేదు

కిసాన్‌నగర్‌లో మాకు రోజు విడిచి రోజు నల్లా నీళ్లు ఇస్తున్నారు. 45ని మిషాలు మాత్రమే నీళ్లు ఇస్తుండడంతో సరిపోవడం లేదు. ప్రెషర్‌ కూడా సక్రమంగా రావడం లేదు. నీళ్ల రంగు మారుతోంది. రోజు విడిచి రోజు ఇచ్చినా సరే కాని, సమయం మాత్రం పెంచాలి. ఫ్రెషర్‌తో వచ్చేలా, కలుషితం కాకుండా చూడాలి.

– సాంబయ్య, కిసాన్‌నగర్‌

మూడు రోజులకోసారి

మా ప్రాంతంలో మూ డు రోజులకోసారి నల్లా ఇస్తున్నారు. అది ఎప్పుడిస్తరో తెలీదు. వచ్చిన నల్లా కూడా ప్రెషర్‌ ఉండడం లేదు. ఎల్‌ఎండీ పక్కనే ఉన్నం కానీ.. మాకు నీళ్లు మాత్రం రావడం లేదు. అధికారులు, సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం ఉండడం లేదు. ఎండాకాలం మరింత ఇబ్బంది పడాల్సి వచ్చేట్లుంది. – వై.సునీత, కోతిరాంపూర్‌

నగరంలో

రిజర్వాయర్ల వివరాలు

హైలెవెల్‌ జోన్‌ పరిధి

కోర్టు రిజర్వాయర్‌ 2

ఎస్‌ఆర్‌ఆర్‌ 2

అంబేడ్కర్‌ 2

రాంనగర్‌ 3

మల్కాపూర్‌ 1

లో లెవెల్‌ జోన్‌ పరిధి

భగత్‌నగర్‌ 1

కట్టరాంపూర్‌ 2

గౌతమినగర్‌ 1

మార్కెట్‌ 2

హౌసింగ్‌బోర్డుకాలనీ 2

కరీంనగర్‌ కార్పొరేషన్‌:

ఈ వేసవి కాలంలో నగరానికి తాగునీటి తండ్లాట తప్పేలా లేదు. సిటీ తాగునీటి సరఫరాకు ఏకై క వనరైన ఎల్‌ఎండీలో నీటిమట్టం వేగంగా తగ్గుతుండడంతో స్వల్పకాలంలోనే ప్రతిరోజు నీటి సరఫరాకు ఫుల్‌స్టాప్‌ పడనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుండగా, లీకేజీలు, మోటార్లతో నల్లా తగినంత ప్రెషర్‌ రావడం లేదు, రంగు, రుచి కూడా మారుతోంది.

ఒక్కోచోట ఒక్కో రకంగా...

ఎల్‌ఎండీ నుంచి రా వాటర్‌ను ఫిల్టర్‌బెడ్‌ వద్ద ఫిల్టర్‌ చేసి సంప్‌ నుంచి 17 రిజర్వాయర్ల ద్వారా నివాసాలకు సరఫరా చేస్తుంటారు. ఒక్కో చోట ఒక్కో రకంగా నీటి సరఫరా జరుగుతోంది. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద చేపట్టిన హౌసింగ్‌బోర్డు రిజర్వాయర్‌ పరిధిలో 24 గంటలు, భగత్‌నగర్‌, ఎస్‌ఆర్‌ఆర్‌,రాంనగర్‌,గౌతమినగర్‌, మల్కాపూర్‌ రిజర్వాయర్ల పరిధిలో ప్రతి రోజు సరఫరా చేస్తుండగా, అంబేడ్కర్‌, రాంపూర్‌ రిజర్వాయర్ల పరిధిలో పూర్తిగా, మార్కెట్‌, కోర్టు రిజర్వాయర్ల పరిధిల్లోని కొన్నికాలనీల్లో రోజు విడిచి రోజు తాగునీరు అందిస్తున్నారు.

ప్రెషర్‌ లేదు..

నిర్వహణ లోపంతో నగరంలో తాగునీటి సరఫరా అస్తవ్యస్థంగా మారింది. సూర్యనగర్‌, మారుతినగర్‌, కిసాన్‌నగర్‌ తదితర కాలనీల్లో నల్లా నీళ్లు సన్నగా వస్తున్నాయి. కిసాన్‌నగర్‌లో రంగుమారుతున్నాయి. నా సిరకం పైప్‌లైన్లు, వాల్వ్‌లతో లీకేజీ లు పెరుగుతుండగా, పలుచోట్ల వి ద్యుత్‌మోటార్లు అమర్చి నీటి చౌర్యానికి పాల్పడుతుండడంతో ప్రెషర్‌ తగ్గిపోతోంది. లీకేజీలు అరికట్టడంలోఅధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలున్నా యి. లో లెవెల్‌ జోన్‌ పరిధిలో ఎక్కువగా లీకేజీలు కనిపిస్తున్నా యి. అంబేడ్కర్‌ రిజర్వాయర్‌ పరిధిలో గతంలో 45 నిమిషాల పాటు ప్రతీరోజు తాగునీటి సరఫరా ఇచ్చే వాళ్లు. ప్రస్తుతం రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నా, అదే 45 నిమిషాల సమయం పాటించడం సమస్యగా మారింది.

నీటి కమిటీలెక్కడ?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్‌ మిత్ర పథకంలో భాగంగా మహిళా సంఘాలతో ఏర్పాటు

చేసిన కమిటీల జాడ కనిపించడం లేదు. గత నెలలో హౌసింగ్‌బోర్డు, రాంనగర్‌,మార్కెట్‌, మల్కాపూర్‌,కోర్టు రిజర్వాయర్లను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టి కమిటీలు ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన రిజర్వాయర్ల పరిధిలో ఇళ్లలోకి వెళ్లి నల్లా కనెక్షన్లు నిర్ధారించడం, లీకేజీలు గుర్తించడం, మరమ్మతులు చేయించడం, నీటి నమూనా నాణ్యత సేకరించాలని కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌ ఆదేశించారు. కానీ ఈ కమిటీలు కాగితాలు దాటి రావడం లేదు.

జాగ్రత్త పడకపోతే ఇక్కట్లే

ఎల్‌ఎండీలో నీటిమట్టం తగ్గుతుండడంతో త్వరలోనే నగరమంతటా రోజు విడిచి రోజు నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి రానుంది. లీకేజీలు సరిచేయడంతో పాటు, ఫిల్టర్‌ బెడ్‌ వద్ద విద్యుత్‌ మోటార్లు, బూస్టర్‌పంప్‌ల పనితీరుపై దృష్టి పెడితేనే రోజు విడిచి రోజు అయినా తాగునీటి సరఫరా సక్రమంగా జరిగే అవకాశం ఉంది. ఇదిలాఉంటే నగరంలోని పాత విలీన ప్రాంతాలైన సరస్వతినగర్‌, తీగలగుట్టపల్లి తదితర ప్రాంతాల్లో నల్లా కనెక్షన్‌ లు లేకపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న దా దాపు 40 మంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను కాలపరిమితి ముగియడంతో తొలగించారు. వారి స్థానంలో ఎవరినీ నియమించుకోకపోవడం కూడా తాగునీటి సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఫిల్టర్‌బెడ్‌

న్యూస్‌రీల్‌

ఎల్‌ఎండీలో నీటి మట్టం వివరాలు

ప్రస్తుత నీటిమట్టం(25, మార్చి) 6.816 టీఎంసీలు

అవుట్‌ఫ్లో 5 వేల క్యూసెక్కులు(కాకతీయ కాలువ, వరంగల్‌)

ఇన్‌ఫ్లో 2450 క్యూసెక్కులు (మిడ్‌మానేరు)

నగరంలో నీటి సరఫరాకు ఉండాల్సిన నీటిమట్టం 12 టీఎంసీలు

ప్రతీరోజు ఎల్‌ఎండీలో తగ్గుతున్న నీటిమట్టం 0.2 టీఎంసీ

No comments yet. Be the first to comment!
Add a comment
తాగునీటికి తండ్లాటే..1
1/9

తాగునీటికి తండ్లాటే..

తాగునీటికి తండ్లాటే..2
2/9

తాగునీటికి తండ్లాటే..

తాగునీటికి తండ్లాటే..3
3/9

తాగునీటికి తండ్లాటే..

తాగునీటికి తండ్లాటే..4
4/9

తాగునీటికి తండ్లాటే..

తాగునీటికి తండ్లాటే..5
5/9

తాగునీటికి తండ్లాటే..

తాగునీటికి తండ్లాటే..6
6/9

తాగునీటికి తండ్లాటే..

తాగునీటికి తండ్లాటే..7
7/9

తాగునీటికి తండ్లాటే..

తాగునీటికి తండ్లాటే..8
8/9

తాగునీటికి తండ్లాటే..

తాగునీటికి తండ్లాటే..9
9/9

తాగునీటికి తండ్లాటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement