ఎరువుల నిల్వల్లో తేడాలుంటే చర్యలు
కరీంనగర్‌రూరల్: ఈ పాస్ మిషన్, స్టాక్ రిజి స్టర్ ప్రకారం ఎరువుల నిల్వలు సక్రమంగా ఉండేలా డీలర్లు సరి చూసుకోవాలని, తేడాలుంటే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం కరీంనగర్ మండలం నగునూరు, చెర్లభూత్కూర్‌లోని కరీంనగర్ సింగిల్ విండో గోదాం, దుర్శేడ్ సహకార సంఘం, మొగ్ధుంపూర్, చేగుర్తిలోని ఎరువుల దుకాణాలను తని ఖీ చేశారు. ఈ పాస్ మిషన్‌లో నమోదైన ఎరువుల విక్రయాల వివరాలు స్టాక్ రిజిస్టర్‌లో ఉండాలని, నిల్వ ఉన్న ఎరువులకు సరిపోవాలని సూచించారు. ఒక రైతుకు రోజుకు 20, నెలకు 50 ఎరువుల బస్తాలను మాత్రమే విక్రయించాలని, ఎక్కువగా ఉంటే తగిన చర్యలు చేపడుతామని తెలిపారు. డీఏవో వెంట ఏడీఏ రణధీర్, ఏవో సత్యం ఉన్నారు.
రైతులకు అవగాహన కల్పించాలి
రైతువేదికల్లో నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంపై అవగాహన కల్పించి రైతులు ఎక్కువసంఖ్యలో హాజరయ్యేలా ఏఈవోలు చర్యలు చేపట్టాలని డీఏవో భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం కరీంనగర్ మండలం చామనపల్లి రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో డీఏవో పాల్గొన్నారు. వేసవిలో పశుగ్రాస యాజమాన్యంపై ప్రధాన శాస్త్రవేత్త బాలాజీ నాయక్, పండ్లతోటలపై విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై హర్టికల్చర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ఫ్రొఫెసరు శంకర్‌స్వామి ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment